Carrot Ginger Juice: క్యారెట్ అల్లం రసం.. కడుపుకి ఓ వరం.. ఒక కప్పులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
క్యారెట్, అల్లం రెండిటిలోనూ విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. క్యారెట్, అల్లం రసం ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీయం. ప్రతిరోజూ ఉదయం క్యారెట్ అల్లం రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మానికి మంచిది, జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ప్రతి ఉదయం శక్తితో ప్రారంభమైతే రోజంతా తాజాగా, ఆరోగ్యంగా అనిపిస్తుంది. ఆరోగ్య పానీయాల కోసం మనం తరచుగా ఖరీదైన , రసాయనాలతో నిండిన కల్తీ పానీయాల ఎంపికల వైపు పరిగెత్తుతాము. అయితే మీ వంటగదిలో ఉన్న క్యారెట్ , అల్లం కలిపి తాగాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. ఈ రెండు పదార్థాలు రుచిలో గొప్పవి మాత్రమే కాదు.. వీటి రసం కలిపినప్పుడు. అది ఆరోగ్యానికి ఆయుర్వేద టానిక్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ప్రతిరోజూ ఉదయం ఒక కప్పు క్యారెట్ , అల్లం రసం తాగడం వల్ల శరీరానికి లోపలి నుంచి పోషణ లభించడమే కాదు అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
కంటి చూపుకు ఒక వరం
క్యారెట్లలో ఉండే బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కళ్ళ వాపు, అలసటను తగ్గించడంలో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తి బలోపేతం
క్యారెట్లు, అల్లం రెండూ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉన్నాయి. అల్లం లోని యాంటీ బాక్టీరియల్ , యాంటీవైరల్ లక్షణాలు శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. అయితే క్యారెట్లు శరీరాన్ని లోపలి నుంచి బలోపేతం చేస్తాయి.
గుండె ఆరోగ్యం
ఈ రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , ఫైబర్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అల్లం రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. క్యారెట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఈ రెండూ గుండెకు మేలు చేస్తాయి.
చర్మ కాంతి, జుట్టు పెరుగుదల
క్యారెట్ , అల్లం రసం చర్మాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి , ఎ జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
బరువు తగ్గడంలో
ఎవరైనా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే ఈ పానీయం వారికీ ఉపయోగకరంగా ఉంటుంది. క్యారెట్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి . అల్లం జీవక్రియను వేగవంతం చేస్తుంది, ఇది కొవ్వును వేగంగా కాల్చేస్తుంది.
జీర్ణ వ్యవస్థ మెరుగు
అల్లం గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తే, క్యారెట్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలాన్ని క్లియర్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం కడుపుకు ఒక వరం లాంటిది.
క్యారెట్-అల్లం రసం ఎలా తయారు చేయాలి?
క్యారెట్లు- 2 మీడియం
అల్లం ముక్క- 1 అంగుళం
నీరు- 1 కప్పు
నిమ్మరసం , తేనె (రుచికి అనుగుణంగా)
క్యారెట్లు , అల్లం బాగా కడిగి ముక్కలుగా కోయాలి.
మిక్సర్‌లో కొంచెం నీళ్లు పోసి బ్లెండ్ చేయండి.
వడకట్టి రసం తీసి, దానికి కొంచెం నిమ్మరసం, తేనె కలిపి తాగండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








