AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: రూ. 2 వేలలోనే అరకు టూర్‌.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే ప్యాకేజీ..

విశాఖపట్నం-అరరకు రైల్‌ కమ్‌ రోడ్‌ ప్యాకేజీ పేరుతో ఈ టూర్‌ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చింది. కేవలం ఒక్కరోజులోనే అరకు లోయతో పాటు మరికొన్ని ప్రాంతాలను సందర్శించేలా ఈ టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చారు. విశాఖపట్నం చేరుకున్న ప్రయాణికులు ఈ టూర్‌ ప్యాకేజీ ద్వారా ఎలాంటి టెన్షన్‌ లేకుండా అరకు టూర్‌ను పూర్తి చేసుకోవచ్చు. ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

IRCTC: రూ. 2 వేలలోనే అరకు టూర్‌.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే ప్యాకేజీ..
Visakha Araku Tour
Narender Vaitla
|

Updated on: Nov 28, 2023 | 4:55 PM

Share

అరకు టూర్‌ను ఒక్కసారైనా సందర్శించాలని చాలా మంది కోరుకుంటారు. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకును మరీ ముఖ్యంగా చలికాలం విజిట్ చేస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరుగా అరకు లోయ. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే వారి కోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త టూర్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

విశాఖపట్నం-అరరకు రైల్‌ కమ్‌ రోడ్‌ ప్యాకేజీ పేరుతో ఈ టూర్‌ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చింది. కేవలం ఒక్కరోజులోనే అరకు లోయతో పాటు మరికొన్ని ప్రాంతాలను సందర్శించేలా ఈ టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చారు. విశాఖపట్నం చేరుకున్న ప్రయాణికులు ఈ టూర్‌ ప్యాకేజీ ద్వారా ఎలాంటి టెన్షన్‌ లేకుండా అరకు టూర్‌ను పూర్తి చేసుకోవచ్చు. ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

ఉదయం 6.45 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ నుంచి ఈ టూర్‌ ప్రారంభమవుతుంది. ట్రైన్‌ నెంబర్‌ 08551 రైలు ఎక్కాల్సి ఉంటుంది. గుహలు, బ్రిడ్జిలు, ప్రకృతి రమణీయత నడుమ ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. అరకుకు ఉదయం 10.55 గంటలకు చేరుకుంటుంది. అక్కడ ట్రైబ్‌ మ్యూజియంతో పాటు మరికొన్ని ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం లంచ్‌ ఉంటుంది. లంచ్‌ పూర్తికాగానే విశాఖ తిరుగు ప్రయాణం ఉంటుంది. తిరుగు ప్రయాణంలో అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్‌, గాలికొండ వ్యూ పాయింట్, బొర్ర గుహల సందర్శన ఉంటుంది. సాయంత్రం తిరిగి విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.

ప్యాకేజీ ధరలు..

ఇక ఈ ప్యాకేజీ ధర విషయానికొస్తే.. ఈసీ క్లాస్‌లో పెద్దలకు రూ. 4450కాగా చిన్నారులకు రూ. 4080గా నిర్ణయించారు. ఎస్‌ఎల్ క్లాస్‌లో ప్రయాణిస్తే పెద్దలకు రూ. 2285, చిన్నారులకు రూ. 1915గా నిర్ణయించారు. ఇక 2ఎస్‌ క్లాస్‌ విషయానికొస్తే పెద్దలకు రూ. 2130, చిన్నారులకు రూ. 1760గా నిర్ణయించారు. అరకులో పలు ప్రాంతాలను సందర్శించడానికి నాన్‌ ఏసీ బస్సులతో పాటు మీల్స్‌, బ్రేక్‌ ఫాస్ట్‌, బొర్ర గుహల ఎంట్రీ ఫీజు, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ అన్నీ ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి.

టికెట్‌ క్యాన్సిలేషన్‌ పాలసీని సైతం ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. టూర్‌కు 15 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే ఒక్క ప్రయాణికుడికి రూ. 250 చొప్పున కట్ చేసుకుంటారు. ఇక 8 నుంచి 14 రోజుల మధ్య అయితే 25శాతం, 4 నుంచి 7 రోజుల మధ్య అయితే 50 శాతం కట్ చేస్తారు. నాలుగు రోజుల కంటే ముందే క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండదు. పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..