IRCTC Packages: జగన్నాథుని దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ.. మధురానుభూతిని అందించే ది బెస్ట్ ప్యాకేజీ ఇదే..!
భారతదేశంలో పూరి జగన్నాథుని రథయాత్ర అంటే తెలియని వారు ఉండరు. ఇటీవల జగన్నాథుని ఆలయానికి చెందిన రహస్య గదిని తెరవడంతో దేశం మొత్తం పూరీ జగన్నాథుని ఆలయం వైపు చూసిదంటే అతిశయోక్తి కాదు. అయితే చాలా మంది భక్తులు పూరి జగన్నాథుని దర్శనం కోసం వెళ్తూ ఉంటారు. దేశంలో తిరుమల తిరుపతి తర్వాత ఆ స్థాయిలో భక్తులు దర్శించుకునేది పూరి జగన్నాథుడినే. ఇక్కడ ఆచారాలు, స్వామి వారికి నైవేథ్యాలు సమర్పించే తీరు వేరుగా ఉంటాయి. అయితే పూరీ జగన్నాథుని ఆలయ దర్శనంతో అదిరే మధురానుభూతిని అందించేలా ఐఆర్‌సీటీసీ కొత్త టూర్ ప్యాకేజీను అందుబాటులోకి తీసుకొచ్చింది.

భారతదేశంలో పూరి జగన్నాథుని రథయాత్ర అంటే తెలియని వారు ఉండరు. ఇటీవల జగన్నాథుని ఆలయానికి చెందిన రహస్య గదిని తెరవడంతో దేశం మొత్తం పూరీ జగన్నాథుని ఆలయం వైపు చూసిదంటే అతిశయోక్తి కాదు. అయితే చాలా మంది భక్తులు పూరి జగన్నాథుని దర్శనం కోసం వెళ్తూ ఉంటారు. దేశంలో తిరుమల తిరుపతి తర్వాత ఆ స్థాయిలో భక్తులు దర్శించుకునేది పూరి జగన్నాథుడినే. ఇక్కడ ఆచారాలు, స్వామి వారికి నైవేథ్యాలు సమర్పించే తీరు వేరుగా ఉంటాయి. అయితే పూరీ జగన్నాథుని ఆలయ దర్శనంతో అదిరే మధురానుభూతిని అందించేలా ఐఆర్‌సీటీసీ కొత్త టూర్ ప్యాకేజీను అందుబాటులోకి తీసుకొచ్చింది. పూరీ జగన్నాథ్ ధామ్ యాత్ర పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ ద్వారా అందమైన ప్రయాణ అనుభవాలను పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
పూరీ జగన్నాథ్ ధామ్ యాత్ర పేరుతో ఉన్న ఈ ప్యాకేజీలో 4 రోజులు/3 రాత్రులు పాటు ఉంటుంది. ముఖ్యంగా హౌరా నుంచి పూరీ చేరుకోవడానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఐఆర్‌సీటీసీ రవాణా సదుపాయాన్ని అందిస్తుంది. ప్రతి శనివారం ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణికులకు అల్పాహారం మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా హోటల్స్, దర్శనం టిక్కెట్స్ అన్ని ఐఆర్‌సీటీసీ అందిస్తుంది. ఐఆర్‌సీటీ ఈ ప్యాకేజీను రెండు విధాలుగా అందిస్తుంది. ట్రిపుల్ షేరింగ్ కోసం ప్రతి వ్యక్తి ప్రామాణిక కేటగిరీని ఎంచుకుని రూ.19,690 చెల్లించాలి. డబుల్ షేరింగ్ కోసం రూ.22,990కి చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ కేటగిరీ ట్రిపుల్ షేరింగ్ ప్యాకేజీ ప్రతి పర్యాటకుడికి రూ.21,250 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ప్రతి వ్యక్తికి డబుల్ షేరింగ్ ఛార్జీలు ₹26,950గా ఉన్నాయి.
ఈ ప్రయాణం హౌరా రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉదయం 6:10 గంటలకు బయలుదేరుతుంది. ప్రయాణికులు పూరీ రైల్వే స్టేషన్‌కి మధ్యాహ్నం 12:35 గంటలకు చేరుకుంటారు. ఫ్రెష్ అప్ కోసం ప్రత్యేక హోటల్స్‌ను ఐఆర్‌సీటీసీ కేటాయిస్తుంది. ఆపై నేరుగా దర్శనం కోసం ఐకానిక్ శ్రీ జగన్నాథ్ ధామ్‌కు తీసుకెళ్తారు. దర్శనం అనంతరం హోటల్‌లోనే రెస్ట్ తీసుకోవాలి. రెండో రోజు చిలికా సరస్సుకి విహారయాత్రకు షెడ్యూల్ చేశారు. పర్యాటకులు తమ సొంత ఖర్చులతో ఇక్కడ బోటింగ్ ఆనందించవచ్చు. మూడో రోజు కోణార్క్ టెంపుల్, కోణార్క్ మ్యూజియం, చంద్రభాగ బీచ్ వంటి ప్రదేశాలకు తీసుకెళ్తారు. ఆఖరి రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ చేశాక లింగరాజ్ ఆలయ దర్శనం తర్వాత తిరిగి ప్రయాణికులను భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో దింపడంతో యాత్ర పూర్తవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం పూరి జగన్నాథుని దర్శనం చేసుకోవాలని అనుకునే వారు ఐఆర్‌సీటీసీ ప్లాన్ బుక్ చేసుకుంటే సరి.
మరిన్ని లైప్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..