AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: సమ్మర్‌లో కేరళ వెళ్తే భలే ఉంటుంది కదూ! హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ. ధరెంతో తెలుసా?

వేసవి రానే వచ్చేసింది. విద్యా సంస్థలు కూడా సెలవులను ప్రకటిస్తున్నాయి. దీంతో సమ్మర్‌ హాలీడేస్‌లో టూర్స్‌కి ప్లాన్‌ చేయడం సర్వసాధారణమైన విషయమే. ఇక భగ భగమండే ఎండల్లో కేరళలాంటి కూల్‌ ప్లేస్‌కి టూర్‌కి వెళ్తే ఆ మజాయే వేరుగా ఉంటుంది కదూ!

IRCTC: సమ్మర్‌లో కేరళ వెళ్తే భలే ఉంటుంది కదూ! హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ. ధరెంతో తెలుసా?
Kerala Tour
Narender Vaitla
|

Updated on: Apr 23, 2023 | 5:40 PM

Share

వేసవి రానే వచ్చేసింది. విద్యా సంస్థలు కూడా సెలవులను ప్రకటిస్తున్నాయి. దీంతో సమ్మర్‌ హాలీడేస్‌లో టూర్స్‌కి ప్లాన్‌ చేయడం సర్వసాధారణమైన విషయమే. ఇక భగ భగమండే ఎండల్లో కేరళలాంటి కూల్‌ ప్లేస్‌కి టూర్‌కి వెళ్తే ఆ మజాయే వేరుగా ఉంటుంది కదూ! అక్కడి ప్రకృతి రమణీయతను ఎంజాయ్‌ చేస్తూ వేడిని తరిమికొట్టొలని మీరూ ప్లాన్‌ చేస్తున్నారా.? అయితే మీకోసమే ఐఆర్‌సీటీసీ మంచి టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నుంచి కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్స్‌ పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్‌ మొత్తం 5 రాత్రులు, 6 రోజుల ప్లాన్‌ ఉంటుంది. మే 02 తేదీన ఈ టూర్‌ ప్రారంభం కానుంది. ఈ ట్రిప్‌లో మున్నార్, అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.

* మొదటి రోజు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి జర్నీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:20 గంటలకు రైలు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్మీలో ఉంటారు.

* రెండో రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మున్నార్ వెళ్తారు. అనంతరం అక్కడ హోటల్‌లో చెక్‌ ఇన్‌ చేస్తారు. సాయంత్రం మున్నార్ టౌన్‌లో పర్యటన ఉంటుంది. రాత్రి మున్నార్‌లోనే భస చేస్తారు.

* ఇక మూడో రోజు ఉదయమే ఎర్నాకులం నేషనల్ పార్క్‌కు చేరుకుంటారు. అక్కడ టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యాం, ఎకో పాయింట్‌లను చూపిస్తారు. రాత్రి కూడా మున్నార్‌లోనే స్టే చేయాల్సి ఉంటుంది.

* నాలుగో రోజు అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత… బ్యాక్‌ వాటర్ ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.

* ఐదవ రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

* ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

ధర ఎలా ఉంటుందంటే..

సింగిల్ షేరింగ్ ధర రూ. 32230 కాగా, డబుల్ షేరింగ్ రూ. 18740గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే ఉంటాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..