AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: వండర్స్ ఆఫ్ వయనాడ్.. బడ్జెట్లో చూసొచ్చేయండి.. పూర్తి వివరాలివే..

ఎటు చూసినా పచ్చదనం, జలపాతాల సవ్వళ్లు, వన్యప్రాణులు, కాఫీ తోటల మధ్య కనువిందు చేసే అందమైన ప్రకృతి సోయగాలు. కాఫీ తోటల పేరు చెప్పగానే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో మీకిప్పటికే అర్ధమై ఉంటుంది. అదేనండీ కేరళలోని అందమైన హిల్ స్టేషన్ వయనాడ్ ట్రిప్ గురించే ఇదంతా. ఇక్కడ కనిపించే లొకేషన్స్ మీరెక్కడా చూసి ఉండరు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశమిది.

IRCTC Tour: వండర్స్ ఆఫ్ వయనాడ్.. బడ్జెట్లో చూసొచ్చేయండి.. పూర్తి వివరాలివే..
Wayanad Trip Irctc Package
Bhavani
|

Updated on: Feb 19, 2025 | 6:15 PM

Share

లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్న వారి కోసం ముఖ్యంగా హైదరాబాదీల కోసం ఇండియన్ రైల్వేస్ ఓ అద్భుతమైన టూరింగ్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అదే హైదరాబాద్ టు వయనాడ్ ట్రిప్. కేరళ అందాలను మాటల్లో వర్ణించలేం. అలాంటి చోట 5 రాత్రులు, 6 పగళ్ల టూర్ ప్యాకేజీతో ఐఆర్సీటీసీ ముందుకొచ్చింది. ఈ ప్యాకేజీలో మీరు ఒక ప్యాకేజీ టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలి. మీకు మీ భాగస్వామికి రైలు టిక్కెట్లు, బస చేయడానికి హోటల్ , ప్రయాణానికి క్యాబ్ సౌకర్యం టూర్ ప్యాకేజీలోనే అందిస్తారు. ఈ టూర్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ లభిస్తుంది. టూర్లో ఏయే సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి? ఎయే ప్రాంతాలు చూసిరావచ్చు వంటి సమాచారం తెలుసుకోండి..

ఇలా బుక్ చేసుకోవాలి..

టూర్ ను బుక్ చేసుకోవడానికి ఇండియన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు. లేదంటే దీని పేరు వండర్స్ ఆఫ్ వయనాడ్ ను సెర్చ్ చేసి కూడా సమాచారాన్ని పొందవచ్చు. ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 25న హైదరాబాద్ నుండి ప్రారంభమవుతుంది. ప్రతి బుధవారం టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ముందుగా రైలు ప్రయాణం.. ఆ తర్వాత క్యాబ్ సౌకర్యం కల్పిస్తారు. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది.

ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి…

డబుల్ షేరింగ్ స్లీపర్ కోచ్ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకుంటే రూ. 18430. మీరు 3సీ కోచ్ తో టూర్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే, ప్యాకేజీ ఫీజు రూ. 21220. ఈ ప్యాకేజీతో మీరు మీ కుటుంబంతో కూడా ప్రయాణించవచ్చు. ముగ్గురితో వెళ్లాలంటే ప్యాకేజీ రుసుము రూ. 17740.

అందుబాటులో ఉన్న సౌకర్యాలు

స్లీపర్ క్లాస్, 3ఏసీ ద్వారా రైలు ప్రయాణం. ప్రయాణానికి ఏసీ వాహనం కేటాయిస్తారు. 3 రోజుల హోటల్, 3 రోజుల అల్పాహారం కాంప్లిమెంటరీగా ఉంటుంది. ప్రయాణ ప్రణాళిక ప్రకారం అన్ని దర్శనీయ ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తారు. టోల్, పార్కింగ్ తో పాటు అన్ని జీఎస్టీ ఫీజులు ప్యాకేజీ ఫీజులలో చేర్చబడ్డాయి. ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీలలో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి మీరు ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు .

ఈ సౌకర్యాలు ప్యాకేజీలో కల్పించరు..

అల్పాహారం కాకుండా హోటల్‌లో భోజనం, రాత్రి భోజనం, ఏవైనా అదనపు సౌకర్యాలు ఉండవు. రైలులో ఆహారం అందుబాటులో ఉండదు. సందర్శనా స్థలాలకు ప్రవేశ టికెట్ ఉంటే, మీరు అదనంగా చెల్లించాలి. బోటింగ్, గుర్రపు స్వారీ, ఇతర వినోద కార్యకలాపాలకు అదనపు చెల్లింపు అవసరం. టూర్ గైడ్ సౌకర్యం అందుబాటులో ఉండదు. మీరు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ నుండి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.