AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Namaskar Benefits: రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

సాంప్రదాయ యోగాలో సూర్య నమస్కారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది శరీరాన్ని దృఢంగా, మనస్సును ప్రశాంతంగా ఉంచే సంపూర్ణ వ్యాయామంగా పని చేస్తుంది. రోజూ కొన్ని నిమిషాలు దీనికి కేటాయిస్తే.. ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శక్తివంతమైన శరీరం, మానసిక బలంతో కూడిన జీవనశైలిని పొందవచ్చు.

Surya Namaskar Benefits: రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
Suryanamaskar Benefits
Prashanthi V
|

Updated on: May 25, 2025 | 10:49 PM

Share

సాంప్రదాయ యోగా పద్ధతుల్లో సూర్య నమస్కారం చాలా శక్తివంతమైనది. ఇది శరీరానికి బలాన్ని, మనస్సుకు ప్రశాంతతను ఇచ్చే పూర్తిస్థాయి వ్యాయామం. 12 రకాల భంగిమలతో కూడిన ఈ ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామం లభిస్తుంది. ఈ యోగాలోని ప్రతి భంగిమ కండరాలను బలంగా చేస్తుంది. మోకాళ్లు, భుజాలు, మెడ, వెన్నెముక వంటి ముఖ్యమైన భాగాలకు మంచి మద్దతునిస్తుంది. రోజూ చేస్తే శరీరం దృఢంగా మారుతుంది.

కొన్ని భంగిమలు ప్రేగులు, కాలేయం, కడుపు వంటి అవయవాలపై ఒత్తిడిని కలిగించి అవి బాగా పనిచేసేలా చేస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

ఈ ఆసనాల ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి రక్తం బాగా చేరుతుంది. చర్మానికి తగినంత ఆక్సిజన్ అందడంతో అది కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.

సూర్య నమస్కారాన్ని వేగంగా చేస్తే శరీరం ఎక్కువ శక్తిని వాడుకుంటుంది. దీనివల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ యోగాసనం చాలా ఉపయోగపడుతుంది.

ఈ యోగాలో శ్వాస పద్ధతికి ప్రాధాన్యత ఉంటుంది. ఊపిరి పీల్చడం, వదలడం వంటి ప్రక్రియలతో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. ఇది ఒక రకంగా ధ్యానంలా పనిచేస్తుంది.

దీన్ని రోజూ చేయడం వల్ల శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దీనివల్ల రోగాల పట్ల సహజమైన రక్షణ లభిస్తుంది. సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

ఈ యోగా చేసేటప్పుడు శ్వాస తీసుకునే ప్రక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులు పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా శరీరం తేలికగా, శక్తివంతంగా అనిపిస్తుంది.

రోజూ సూర్య నమస్కారం చేస్తే.. నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. శరీరానికి ప్రశాంతత చేకూరుతుంది. దీని వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుంది. మంచి నిద్ర వల్ల శరీరం మరింత ఆరోగ్యంగా మారుతుంది.

సూర్య నమస్కారం కేవలం వ్యాయామం మాత్రమే కాదు.. ఇది ఒక సంపూర్ణ ఆరోగ్య సాధన. ఇది శరీరాన్ని బలంగా, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. రోజూ కొద్దిసేపు దీనికి కేటాయిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.