AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti Aging Secrets: ముఖంపై ముడతలు తగ్గే సొల్యూషన్ మీ ఇంట్లోనే ఉంది..!

వయసు పెరిగే కొద్దీ చర్మం పై ముడతలు రావడం సహజం. ముఖ్యంగా ముఖం పై ముడతలు పడటం చాలా మందిని కలవరపెడుతుంది. దీనికి ఖరీదైన క్రీములు, లోషన్లు వాడటం కంటే.. ఇంట్లోనే దొరికే సహజ పదార్థాలతో చిట్కాలు పాటించడం ఆరోగ్యానికి మంచిది.

Anti Aging Secrets: ముఖంపై ముడతలు తగ్గే సొల్యూషన్ మీ ఇంట్లోనే ఉంది..!
Anti Aging
Prashanthi V
|

Updated on: May 25, 2025 | 10:58 PM

Share

బయట దొరికే స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో ఎక్కువగా రసాయనాలు ఉంటాయి. ఇవి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వకపోగా చర్మానికి హాని కలిగించవచ్చు. కానీ ఇంట్లో తయారు చేసుకునే సహజ ప్యాకులు, మసాజ్ ఆయిల్స్ చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా.. ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.

కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ E చర్మానికి తేమను అందించి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి తాజా కలబంద గుజ్జును రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేస్తే ముఖం మెరుస్తుంది.

నిమ్మకాయలోని విటమిన్ C చర్మ కణాలను తిరిగి వృద్ధి చేయడంలో సహాయపడుతుంది. తేనె చర్మానికి సహజంగా తేమను అందిస్తుంది. ఈ రెండింటిని సమాన మోతాదులో కలిపి వారానికి 2 నుంచి 3 సార్లు ముఖానికి ప్యాక్‌ లా వేయాలి. ఇది ముడతలను తగ్గించడంతో పాటు చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది.

ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కొబ్బరి నూనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని మృదువుగా ఉంచి ముడతలను క్రమంగా తగ్గిస్తాయి.

బాగా పండిన అరటి పండును మెత్తగా చేసి దానికి ఒక స్పూన్ పాలు కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ మిశ్రమం చర్మానికి పోషణనిచ్చి ముడతలు రాకుండా అడ్డుకుంటుంది. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వాడితే మంచి ఫలితం ఉంటుంది.

చందనం చర్మాన్ని తాజాగా ఉంచడంలో ప్రసిద్ధి చెందింది. గులాబీ నీరు చర్మాన్ని చల్లబరుస్తూ.. నొప్పి, దురదను తగ్గిస్తుంది. ఈ రెండింటినీ కలిపి పేస్ట్‌ లా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ముడతలను తగ్గించడంతో పాటు.. ముఖానికి ప్రశాంతతను ఇస్తుంది.

చర్మ ఆరోగ్యానికి సహాయపడే రెండు విషయాలు మనం తప్పకుండా పాటించాలి. తగినంత నీరు తాగడం, సరిగ్గా నిద్రపోవడం. రోజూ కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర, రోజంతా 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం వల్ల చర్మం సహజంగా ఆరోగ్యంగా ఉంటుంది.

వయసుతో పాటు వచ్చే ముడతలను పూర్తిగా ఆపలేకపోయినా.. సరైన ఇంటి చిట్కాలతో వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. సహజ పదార్థాలతో చర్మ సంరక్షణ చేయడం వల్ల చర్మం తేమగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే వాడాలి.

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు