మీ ఫ్రిడ్జ్ పాడైపోకుండా ఉండాలంటే.. ఈ లీకేజీని అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
మీ ఫ్రిడ్జ్ నుంచి తరచుగా నీరు బయటకు వస్తోందా..? ఇది చిన్న విషయం కాదు. అసలు సమస్య ఏంటో తెలుసుకోకపోతే మీ ఫ్రిడ్జ్ కి నష్టం తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వెనక ఉన్న కారణాలను గుర్తించి వెంటనే పరిష్కరించడం చాలా ముఖ్యం.

ఫ్రిడ్జ్ నుంచి తరచుగా నీరు బయటకు వస్తోందా..? అయితే అది మీ ఫ్రిడ్జ్ కి ఏదో లోపం వచ్చిందని చెప్పే సంకేతం. బయటకు కనిపించే సమస్య పెద్దదిగా అనిపించకపోయినా.. దీన్ని పట్టించుకోకపోతే ఫ్రిడ్జ్ కి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని వెనక ఉన్న కారణాలను గుర్తించి వాటిని సరిగా పరిష్కరించాలి.
నీటి డ్రైనేజ్ లోపం
ప్రతి ఫ్రిడ్జ్‌లో కూడా తేమ వల్ల ఏర్పడే నీటిని బయటకు పంపించే డ్రైన్ వ్యవస్థ ఉంటుంది. అయితే ఆ డ్రైన్ పైపు మట్టి కణాలు, ఆహారపు ముక్కలు లేదా ఐస్ ముక్కలతో బ్లాక్ అయినప్పుడు నీరు సరిగా బయటకు వెళ్లక ఫ్రిడ్జ్ లోపల నుంచి లీవ్ అవ్వడం మొదలవుతుంది. ఇది జాగ్రత్తగా శుభ్రం చేయకపోతే మురికి అక్కడ పేరుకుని మరిన్ని సమస్యలకు దారితీయవచ్చు.
ఐస్ పేరుకుపోవడం
ఫ్రిడ్జ్ గాలి నుంచి తేమను తక్కువ సమయంలోనే లాక్కుని ఐస్ గా మారుస్తుంది. అయితే కొన్నిసార్లు అది కరిగే ప్రక్రియ సరిగా జరగకపోతే మంచు ఎక్కువగా పేరుకుపోతుంది. ఫ్రిడ్జ్ ను తరచుగా తెరిచిపెట్టడం లేదా ఎక్కువసేపు ఓపెన్ గా ఉంచడం వల్ల కూడా ఇదే సమస్య వస్తుంది. ఐస్ కరిగిపోకుండా ఉండిపోతే అది నీరుగా మారి బయటకు వస్తుంది.
తలుపు సీల్ బలహీనత
ఫ్రిడ్జ్ తలుపు చుట్టూ ఉండే రబ్బరు పట్టీ పాడైతే లేదా సరిగా అతుక్కోకపోతే బయటి గాలిలో ఉండే వేడి తేమ లోపలికి వస్తుంది. ఇది తలుపు సరిగా మూయకపోయేలా చేస్తుంది. ఆ తేమ మరింతగా చల్లబడి నీరుగా మారుతుంది. ఫలితంగా నీరు లీక్ అవుతుంది. తలుపు మూసిన తర్వాత గ్యాప్ కనిపిస్తే వెంటనే సీల్ ను మార్చాల్సి ఉంటుంది.
ఫ్రిడ్జ్ నిలిపే స్థలం సరైనదేనా..?
చాలా మంది ఫ్రిడ్జ్ ను వంటగదిలో, గదిలో అందుబాటులో ఉండే ఏ ప్రదేశంలోనైనా పెట్టేస్తారు. కానీ అది ఫ్లాట్ గా లేకపోతే ఫ్రిడ్జ్ పనితీరుపై ప్రభావం పడుతుంది. కొద్దిగా వంకరగా ఉన్న చోట ఉంచిన ఫ్రిడ్జ్ లోపల చల్లబడిన నీరు సరిగా ప్రవహించకుండా ఫ్రిడ్జ్ బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల మోటార్, కంప్రెసర్ లాంటి భాగాలపైనా ప్రభావం పడవచ్చు.
ఫ్రిడ్జ్ నుంచి నీరు రావడం మామూలు విషయమనే అభిప్రాయం తప్పు. ఇది ఏదో లోపం జరిగిందని చెప్పే సూచన కావచ్చు. చిన్న లీకేజీని ముందే గమనించి దాన్ని సరిచేయకపోతే ఫ్రిడ్జ్ పూర్తిగా పనిచేయకపోవడమే కాకుండా.. రిపేర్ ఖర్చు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
పైన చెప్పిన కారణాలు గమనించి సమయానికి సరిచేస్తే మీరు మీ ఫ్రిడ్జ్ ను సంవత్సరాల తరబడి ఆరోగ్యంగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా వాడే విధానం, నిలిపే స్థలం, శుభ్రత.. ఈ మూడు విషయాల్లో శ్రద్ధ పెట్టాలి. అంతేకాదు లీకేజీ కనిపించగానే పరిష్కారం కోసం నిపుణులను సంప్రదించాలి.




