
ఒక్కోసారి చిరాకు ఎక్కువగా ఉంటుంది. దీంతో కోపం ముక్కుపైకి వచ్చి తిష్టవేస్తుంది. ఇలా కోపంగా ఉన్నప్పుడు మనం చేసే తప్పులు మళ్ళీ ఎప్పటికీ సరిదిద్దుకోలేని విధంగా డ్యామేజ్ చేస్తాయి. అందుకే ఎక్కువగా కోపం తెచ్చుకోవద్దని పెద్దలు అంటుంటారు. అయినప్పటికీ, చాలా మందికి చిన్న విషయాలకు కూడా కోపం వస్తుంది. కోపంతో అయినవాళ్లపై అరుస్తుంటారు. ఈ రకమైన కోపం చాలా ప్రమాదకరమైనది. అది శాంతిని నాశనం చేస్తుంది. సంబంధాలను కూడా విచ్ఛిన్నం చేస్తుంది. మీరు కూడా అందరిపై ఒకే విధంగా కోపంగా ఉంటారా? ఈ కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలా అని ఆలోచిస్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి..
కోపాన్ని నియంత్రించడానికి సరళమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం లోతైన శ్వాస తీసుకోవడం. మనం కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస వేగం అవుతుంది. ఇది శరీరంలో ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇది మరింత కోపానికి దారితీస్తుంది. కాబట్టి మీరు కోపంగా ఉన్నప్పుడు, ముక్కు ద్వారా లోతైన శ్వాస తీసుకోండి. తర్వాత మీ నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదిలివేయండి. ఇలా చేయడం వల్ల మెదడుకు ఆక్సిజన్ అందుతుంది. దీనివల్ల కోపం వెంటనే తగ్గుతుంది.
కోపాన్ని నియంత్రించడానికి మరొక ప్రభావవంతమైన మార్గం చల్లని నీరు తాగడం. కోపం వచ్చినప్పుడు ఒక గ్లాసు చల్లటి నీరు తాగాలి. చల్లటి నీరు శరీర ఉష్ణోగ్రతను, మనస్సును చల్లబరుస్తుంది. అలాగే కోపాన్ని కూడా చల్లబరుస్తుంది.
కొంతమంది కోపంగా ఉన్నప్పుడు కోపంతో ఏదో ఒకటి మాట్లాడతారు. ఇలా చేయడం వల్ల అయిన వారితో ఉన్న మంచి సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి కోపంలో తప్పుగా మాట్లాడటం కంటే కోపంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండటం మంచిది. కాబట్టి మీకు కోపం వచ్చినప్పుడల్లా మౌనంగా ఉండటం అలవాటు చేసుకోండి. మౌనం మనసును ప్రశాంతపరుస్తుంది.
మీరు చాలా కోపంగా ఉంటే ముందుగా లేచి ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోండి. ఎందుకంటే అక్కడ ఉండటం వల్ల కోపం పెరుగుతుంది. కాబట్టి లేచి వెళ్ళిపోవాలి. ఇలా స్థలాలను మార్చడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీని ద్వారా, మీ కోపం కూడా చల్లబడుతుంది.
మీరు మీ మొబైల్ చూడటం ద్వారా కూడా మీ కోపాన్ని నియంత్రించుకోవచ్చు. కోపం తగ్గించుకోవడానికి మీ మొబైల్‌లో ఫన్నీ వీడియోలు చూడండి. ఇది కోపాన్ని తగ్గిస్తుంది. మనస్సును తేలికపరిచి, ప్రశాంతపరుస్తుంది.
కోపాన్ని నియంత్రించుకోవడానికి మరో గొప్ప మార్గం మీకు ఇష్టమైన పాటలను వినడం. ఈ సమయంలో సంగీతం వినడం చాలా మంచి మార్గం. ఇది మీ మనసును ప్రశాంతపరుస్తుంది. మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.