AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Potato Chips: ఆలూ చిప్స్‌ ఇష్టమని రోజూ లాగిస్తున్నారా? మీ ఒంట్లో ఏం జరుగుతుందో తెలిస్తే జన్మలో ముట్టుకోరు..

చాలా మందికి నూనెలో వేయించిన పొటాటో చిప్స్ తినడం చాలా ఇష్టం. అయితే వీటిని రోజూ తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? అలాగే నెలలో ఎన్నిసార్లు ఆలూ చిప్స్‌ తినవచ్చు? అసలు రోజూ తింటే ఏమవుతుంది? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

Potato Chips: ఆలూ చిప్స్‌ ఇష్టమని రోజూ లాగిస్తున్నారా? మీ ఒంట్లో ఏం జరుగుతుందో తెలిస్తే జన్మలో ముట్టుకోరు..
Potato Chips
Srilakshmi C
|

Updated on: Aug 12, 2025 | 6:27 PM

Share

నూనెలో వేయించిన ఆలూ చిప్స్‌, చైనీస్‌ ఫ్రైస్‌ వంటి వేయించిన ఆహారాలు ఇష్టపడని వారుండరు. ఇవి రుచికి భలేగా ఉంటాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌ చూసేటప్పుడు లేదంటే ఆఫీసులో పనిచేసేటప్పుడు కొందరు స్నాక్‌గా వీటిని తింటుంటారు. కానీ ప్రతిరోజూ ఆలూ చిప్స్‌ తినడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? ఆలూ చిప్స్‌ తినడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? అలాగే, నెలలో ఎన్నిసార్లు ఆలూ చిప్స్‌ తినవచ్చు? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతిరోజూ ఆలూ చిప్స్‌ తినడం వల్ల అది శరీరానికి ‘స్లో పాయిజన్’ లాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజూ ఆలూ చిప్ప్‌ తినే అలవాటు ఉంటే ఇప్పుడే ఆపండం మంచిది. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఆలూ చిప్స్‌లో ఉప్పు, అదనపు కొవ్వులు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను ఆహ్వానిస్తాయి. ఆలూ చిప్స్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. నాణ్యమైన కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఈ ఆహారాలు సులభంగా జీర్ణం కావు. దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా బరువు పెరుగుతుంది. ఇది బరువును కూడా పెంచుతుంది.

ఆలూ చిప్స్‌ వేయించడానికి ఉపయోగించే నూనెలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండెకు చాలా హానికరం. ఈ కొవ్వులు రక్త నాళాలలో అడ్డంకులను కలిగిస్తాయి. ఇది గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది భవిష్యత్తులో గుండె జబ్బుల అవకాశాలను పెంచుతుంది. ఆలూ చిప్స్‌లో అధిక ఉప్పు శాతం వల్ల రక్తపోటును పెంచుతుంది. ఇది గుండె, మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది అవయవాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. ఆలూ చిప్స్‌లో ఎటువంటి పోషకాలు ఉండవు. ఇవి రుచిగా ఉన్నప్పటికీ ఇందులో కేలరీలు, ఉప్పు, కొవ్వులు మాత్రమే ఉంటాయి. కాబట్టి, శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ లభించదు.

ఇవి కూడా చదవండి

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆలూ చిప్స్‌ ప్రాసెస్ చేయబడిన ఆహారం కాబట్టి, వాటిని అరుదుగా మాత్రమే తినాలి. నెలలో ఎన్నిసార్లు ఆలూ చిప్స్‌ తినాలో నిర్దిష్ట సంఖ్య లేదు. కానీ ప్రతిరోజూ ఆలూ చిప్స్‌ తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మీరు ఆలూ చిప్స్‌ తినాలనుకుంటే, నెలకు ఒకటి లేదా రెండుసార్లు తినడం మంచిది. కానీ వాటిని తినేటప్పుడు వీలైనంత తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. మొత్తం ప్యాకెట్‌ను ఒకేసారి తినడానికి బదులుగా, తక్కువ మొత్తంలో తినడం వల్ల ఆరోగ్యానికి పెద్దగా హాని జరగదు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆలూ చిప్స్‌ బదులుగా ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం అవసరం. అంటే యాపిల్, అరటిపండ్లు, నారింజ, బాదం, వాల్‌నట్స్, శనగలు, వేయించిన మఖానా తినవచ్చు. ఈ ఆహారాలు రుచిగా ఉండటం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచివి. వీటిని తింటే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.