Snake Fruit: స్నేక్ ఫ్రూట్ తింటే శరీరంలో జరిగేది ఇదే..

ఆరోగ్యంగా ఉండేందుకు ప్రకృతి ఎంతో సహాయ పడుతుంది. అయితే మనం వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేదే అసలైన విషయం. ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు ఇలా చాలానే ఉంటాయి. ముఖ్యంగా పండ్లు శరీరానికి ఎంతో మంచిది. ఇందులో అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. వీటిని తీసుకోవడం లవ్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలకు కూడా బైబై చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఈ పండ్లలో..

Snake Fruit: స్నేక్ ఫ్రూట్ తింటే శరీరంలో జరిగేది ఇదే..
Snake Fruit

Updated on: Jun 18, 2024 | 1:11 PM

ఆరోగ్యంగా ఉండేందుకు ప్రకృతి ఎంతో సహాయ పడుతుంది. అయితే మనం వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేదే అసలైన విషయం. ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు ఇలా చాలానే ఉంటాయి. ముఖ్యంగా పండ్లు శరీరానికి ఎంతో మంచిది. ఇందులో అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. వీటిని తీసుకోవడం లవ్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలకు కూడా బైబై చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఈ పండ్లలో చాలా కొత్త రకాలు వస్తున్నాయి. వాటిల్లో ఈ స్నేక్ ఫ్రూట్ కూడా ఒకటి. అదేంటి స్నేక్ ఫ్రూట్ అనుకుంటున్నారా.. చూడటానికి ఈ పండు పాము చర్మం రంగులో ఉంటుంది. అందుకే ఈ పండుకు ఈ పేరు వచ్చింది.

ఈ స్నేక్ ఫ్రూట్ ఎక్కువగా ఇండోనేషియాలో లభ్యమవుతుంది. ఈ మధ్య థాయిలాండ్, మలేషియం, ఫిలిప్పీన్స్‌ దేశాలు కూడా స్నేక్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ఈ పండులో చాలా రకాలు ఉన్నాయి. యాపిల్ కంటే మరింత రుచిగా ఈ పండు ఉంటుంది. అందుకే మరిన్ని దేశాలు కూడా ఈ పంట సాగు చేస్తున్నారు. ఈ పండును ఇతర పండ్ల మాదిరిగానే ఉపయోగించుకోవచ్చు. ఈ స్నేక్ ఫ్రూట్‌లో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభ్యమవుతాయి. మరి వీటితో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కంటి ఆరోగ్యం:

ఈ స్నేక్‌ ఫ్రూట్‌ని సలాక్ అని కూడా పిలుస్తారు. ఇందులో బీటా కెరోటిన్ మెండుగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్ తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయి. కంటి చూపు కూడా మెరుగు పడుతుంది.

ఇవి కూడా చదవండి

జ్ఞాపక శక్తి పెరుగుతుంది:

స్నేక్ ఫ్రూట్ తినడం వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఇందులో పొటాషియం, పెక్టిన్ లభ్యమవుతాయి. కాబట్టి ఇవి అభిజ్ఞా పనితీరుని పెంచుతాయి. దీంతో మెదడు యాక్టీవ్‌ అవుతుంది. మతి మరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

గుండె ఆరోగ్యం:

స్నేక్ ఫ్రూట్‌ తినడం వల్ల గుండె ఆరోగ్యం పనితీరు మెరుగు పడుతుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు.. రక్త పోటును, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీంతో జబ్బుల బారిన పడకుండా గుండె చక్కగా పని చేస్తుంది.

వెయిట్ లాస్:

వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు సలాక్ పండు తింటే చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు.. జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కరిగిస్తుంది. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

రోగ నిరోధక శక్తి:

ఈ పండు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు.. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. దీంతో అలసట, నీరసం దరి చేరకుండా ఉంటాయి. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..