Fish Oil: ఫిష్ ఆయిల్ తీసుకుంటే బాడీలో జరిగేది ఇదే..
చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చేపల్లో మంచి కొవ్వులు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, 6 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభ్యమవుతాయి. అందుకే చేపలు తినమని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. చేపలు తినడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అయితే అందరూ చేపలు తినరు. దీని వల్ల పోషకాహార లోపంతో ఇబ్బంది పడతారు. ఇలాంటి వారి కోసమే చేప నూనెని..

చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చేపల్లో మంచి కొవ్వులు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, 6 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభ్యమవుతాయి. అందుకే చేపలు తినమని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. చేపలు తినడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అయితే అందరూ చేపలు తినరు. దీని వల్ల పోషకాహార లోపంతో ఇబ్బంది పడతారు. ఇలాంటి వారి కోసమే చేప నూనెని.. సప్లిమెంట్స్ ద్వారా ఇస్తారు. చేప నూనెను అనేక రకాల చేపల నుంచి తీస్తారు. వీటీని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని.. వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది.
గుండె జబ్బులు మాయం:
చేప నూనె తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐకోసాపెంటోనోయిన్ యాసిడ్స్, డోకోసాహెక్సోనోయిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించి.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వీటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
బ్రెయిన్ హెల్త్:
ఫిష్ ఆయిల్‌ని సప్లిమెంట్స్‌లా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా పని చేస్తుంది. వీటిల్లో ఉండే పోషకాలు బ్రెయిన్‌కి కావాల్సినంత శక్తిని అందజేస్తాయి. మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఒత్తిడి, ఆందోళనను అదుపులో ఉంచుతుంది.
కిడ్నీల హెల్త్:
ఫిష్ ఆయిల్‌ని తీసుకోవడం వల్ల మూత్ర పిండాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. వీటిల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మూత్ర పిండాలు సక్రమంగా పని చేసేందుకు హెల్ప్ చేస్తుంది. కిడ్నీల్లోని మలినాలను బయటకు పంపేందుకు సహాయ పడుతుంది.
శ్వాస సమస్యలు తగ్గుతాయి:
చేప నూనె తీసుకోవడం వల్ల శ్వాస కోశ సమస్యలు కూడా తగ్గుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐకోసాపెంటోనోయిన్ యాసిడ్స్, డోకోసాహెక్సోనోయిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శ్వాస నాళాల్లో ఏర్పడిన అడ్డంకులను క్లియర్ చేస్తాయి. అయితే ఈ సప్లిమెంట్స్‌ని ఎలా పడితే అలా వేసుకోకూడదు. వైద్యుల ప్రిస్కిప్షన్ ప్రకారం మాత్రమే ఉపయోగించాలి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..