Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tours: చుట్టేద్దామా కశ్మీర్.. అతి తక్కువ ఖర్చుతో ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీ..

భూమి మీద స్వర్గం లా భావించే ఆ ప్రాంతానికి వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. ఆ ప్రాంతంలో మంచుకొండలు, చెట్లు, లోయలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. కశ్మీర్ వెళ్లడానికి ఎంత ఆసక్తి ఉన్నా, ఎలా వెళ్లాలి, ఏఏ ప్రాంతాలను చూడాలని అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో చాలామంది వెనకడుగు వేస్తారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ మంచి టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.

IRCTC Tours: చుట్టేద్దామా కశ్మీర్.. అతి తక్కువ ఖర్చుతో ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీ..
Kashmir Tour
Follow us
Madhu

|

Updated on: Apr 17, 2024 | 8:04 AM

పర్యాటకంపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. ఏమాత్రం అవకాశం ఉన్నా కుటుంబంతోనో, స్నేహితులతోనో కలిసి వివిధ ప్రాంతాలను చుట్టివచ్చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేయడంతో పాటు అక్కడ పర్యాటకులు ఉండటానికి అన్ని వసతులు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లి, అక్కడి అందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దేశంలో దాదాపు ప్రజలందరికీ ఇష్టమైన ప్రాంతం కశ్మీర్. భూమి మీద స్వర్గం లా భావించే ఆ ప్రాంతానికి వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. ఆ ప్రాంతంలో మంచుకొండలు, చెట్లు, లోయలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. కశ్మీర్ వెళ్లడానికి ఎంత ఆసక్తి ఉన్నా, ఎలా వెళ్లాలి, ఏఏ ప్రాంతాలను చూడాలని అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో చాలామంది వెనకడుగు వేస్తారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ మంచి టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. తక్కువ ఖర్చుతోనే కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించింది.

టూర్ ప్యాకేజీ..

కశ్మీర్ అందాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. దీన్ని చూడటానికి అనేక మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. వారందరి కోసం ఐఆర్సీటీసీ కశ్మీర్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. శ్రీనగర్, గుల్మార్గ్, సోన్‌మార్గ్, పహల్గామ్‌ తదితర ప్రాంతాలను చూడవచ్చు. ఆరు రోజులు, ఐదు రాత్రులు టూర్ ఉంటుంది. ముందుగా పర్యాటకులందరినీ విమానంలో కశ్మీర్ తీసుకువస్తారు. మిస్టికల్ కాశ్మీర్ ఎక్స్ హైదరాబాద్ (షా 11) పేరు గల ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 12, 15, 19, 23 తేదీలలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఖర్చు వివరాలు..

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఒంటరిగా ప్రయాణిస్తే వారు రూ.51,300 చెల్లించాలి. ఇద్దరు కలిసి వెళితే ఒక్కొక్కరికీ రూ.52,930 చొప్పున ఖర్చవుతుంది. అలాగే ముగ్గురు కలిసి వెళితే రూ.రూ.58,565 వంతున చెల్లించాలి. ఐఆర్ సీటీసీ వెబ్‌సైట్ను సందర్శించి, కశ్మీర్ టూర్ ప్యాకేజీని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదా బుక్కింగ్ కార్యాలయానికి వెళ్లి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.

మంచి అవకాశం..

కశ్మీర్ అందాలు చూడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఏమాత్రం ఇబ్బంది లేకుండా కాశ్మీర్ లోని పర్యాటక ప్రాంతాలను చూసిరావచ్చు. టూర్ ప్యాకేజీలో ఉన్న ప్రాంతాలన్నింటినీ దగ్గరుండి చూపిస్తారు. కాబట్టి భాష తదితర సమస్యలు లేకుండా కశ్మీర్ లో ఎంజాయ్ చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మండుటెండల్లో చల్లని వాతావారణాన్ని ఆస్వాదించాలనుకుంటే అందాల కశ్మీర్ వెళ్లొచ్చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..