Bamboo Leaves Health Benefits: ఈ ఆకులు మధుమేహంతో సహా శ్వాసకోశ సమస్యలకు దివ్యౌషధం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..?

వెదురు ఆకులను తీసుకోవడం వల్ల డయాబెటిక్ రోగులకు చాలా మేలు జరుగుతుందని నిరూపించబడింది. ఫైబర్ పుష్కలంగా ఉండే వెదురు ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వాటి వినియోగం శరీరంలో ఇన్సులిన్ స్పైక్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్‌లో ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, మీరు మీ వైద్యుని సలహాతో వెదురు ఆకులతో చేసిన టీని తాగొచ్చు.

Bamboo Leaves Health Benefits: ఈ ఆకులు మధుమేహంతో సహా శ్వాసకోశ సమస్యలకు దివ్యౌషధం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..?
Bamboo Leaves Health Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 24, 2024 | 3:53 PM

Bamboo Leaves Health Benefits: శతాబ్దాలుగా ఔషధంగా ఉపయోగించే అనేక చెట్లు, మొక్కలు మన చుట్టూ ఉన్నాయి. వాటిలో వెదురు గడ్డి కూడా ఒకటి. అవును, దంతమంజన నుండి గ్రామాలలో ఇళ్ల పైకప్పులను వేసుకోవడానికి కూడా వెదురు కలపను ఉపయోగిస్తుంటారు. అయితే వెదురు చెట్టు మాత్రమే కాదు.. దాని ఆకులతో కూడా ఎంతో మేలు కలుగుతుందని మీకు తెలుసా? అవును, వెదురు ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. వీటి వాడకంతో మధుమేహం నుంచి ఊబకాయం వరకు అన్నీ అదుపులో ఉంటాయి. ఈ ఆకులు శ్వాసకోశ సమస్యల నుండి కూడా సమర్థవంతంగా ఉపశమనం కలిగిస్తాయి. వెదురు ఆకులను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని రుజువు చేస్తుంది. కాబట్టి వెదురు ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

డయాబెటిస్‌లో మేలు చేస్తుంది..

వెదురు ఆకులను తీసుకోవడం వల్ల డయాబెటిక్ రోగులకు చాలా మేలు జరుగుతుందని నిరూపించబడింది. ఫైబర్ పుష్కలంగా ఉండే వెదురు ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వాటి వినియోగం శరీరంలో ఇన్సులిన్ స్పైక్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్‌లో ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, మీరు మీ వైద్యుని సలహాతో వెదురు ఆకులతో చేసిన టీని తాగొచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిపూత నుండి ఉపశమనం కలిగిస్తుంది..

వెదురు ఆకులను నోటిపూతలను తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించాలంటే వెదురు ఆకులను బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దానికి తేనె కలుపుకుని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేస్తుంటే నోటిపూత నుంచి బయటపడవచ్చు.

పొడి దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది..

మీరు పొడి దగ్గు సమస్యతో బాధపడుతుంటే, వెదురు ఆకులు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. అంతే కాదు శ్వాస సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. దీని కోసం వెదురు ఆకులను ఎండబెట్టి గ్రైండ్ చేసుకుని పొడిని తయారు చేసుకోవాలి. అందులో తేనె మిక్స్ చేసి తినాలి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

వెదురు ఆకులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మీరు గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం లేదా అతిసారం వంటి సమస్యలతో బాధపడుతుంటే, మీరు వెదురు ఆకులతో చేసిన టీ లేదా డికాక్షన్ తాగవచ్చు. ఇది పొట్టకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది.

చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది..

వెదురు ఆకులను ఉపయోగించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు. దీని కోసం, తాజా వెదురు ఆకులను రుబ్బు కోవాలి. ఈ పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల చర్మ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాదు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు