Andhra Pradesh: అన్నమయ్య జిల్లాలో అద్భుత ఘటన.. 30ఏళ్ల వేప చెట్టులో కనిపించిన వింత దృశ్యం

వేప చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తామని స్థానిక మహిళలు చెప్పారు. వేప చెట్టు నుంచి పాలు రావడం అమ్మవారి మహిమేనని వారు విశ్వసిస్తున్నారు. వేప చెట్టుకి ఒక దగ్గర నుంచి కాకుండా అనేక చోట్ల నుంచి పాలు రావడం నిజంగా ఈ ప్రాంతవాసుల అదృష్టంగా స్థానిక మహిళలు చెబుతున్నారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడులో ఇలా వేప చెట్టు నుంచి పాలు కారుతున్న సంఘటన సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

Andhra Pradesh: అన్నమయ్య జిల్లాలో అద్భుత ఘటన.. 30ఏళ్ల వేప చెట్టులో కనిపించిన వింత దృశ్యం
Neem Tree In Kadapa
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 24, 2024 | 3:28 PM

అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో వింత సంఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు నుంచి పాలు వస్తుండటంతో.. అక్కడి ప్రజలు ఈ వింతను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వేప చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తామని స్థానిక మహిళలు చెప్పారు. వేప చెట్టు నుంచి పాలు రావడం అమ్మవారి మహిమేనని వారు విశ్వసిస్తున్నారు. వేప చెట్టుకి ఒక దగ్గర నుంచి కాకుండా అనేక చోట్ల నుంచి పాలు రావడం నిజంగా ఈ ప్రాంతవాసుల అదృష్టంగా స్థానిక మహిళలు చెబుతున్నారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడులో ఇలా వేప చెట్టు నుంచి పాలు కారుతున్న సంఘటన సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

ఎర్రంరాజుగారి పల్లె ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. 30ఏళ్ల వయసున్న వేపచెట్టు నుండి పాలు ఉబికి వస్తున్నాయి. ఈ విషయం చూసిన స్థానిక ప్రజలు చుట్టు పక్కల వారికి తెలియజేయడంతో వింతగా చూస్తున్నారు.. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ప్రజలు అధిక సంఖ్యలో చూడటానికి వస్తున్నారు. తమ గ్రామంలో మునుపెన్నడూ ఇలాంటి వింతలు చూడలేదని స్దానిక ప్రజలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

వేప చెట్టునుంచి ఉబికి వస్తున్న పాలపదార్దం లాంటి ద్రావకాన్ని చూసిన స్థానికులు నివ్వేరపోతున్నారు.. అది పాలా.? లేదంటే..మరేదైనా జిగట పదార్దమా అనేది అర్దం కావడం లేదని స్దానికులు అంటున్నారు. మొత్తానికి ఈ వింతను చూసేందుకు మాత్రం గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల ప్రజలు సైతం బారులు తీరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..