Health: శరీరంలో ఈ లక్షణాలా.? జింక్‌ లోపం ఉన్నట్లే..

శరీరానికి తప్పకుండా కావాల్సిన పోషకాల్లో జింక్‌ ఒకటి. ఇది శరీరానికి చాలా ముఖ్యమైన ఖనిజం. శరీరానికి కావాల్సిన జింక్‌ అందాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఓట్స్‌, గుమ్మడి గింజలు, జీడిపప్పు, వాల్‌నట్స్‌ వంటివాటిని కచ్చితంగా తీసుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కచ్చితంగా...

Health: శరీరంలో ఈ లక్షణాలా.? జింక్‌ లోపం ఉన్నట్లే..
Zinc
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 21, 2024 | 9:01 PM

శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు సరిగ్గా లభిస్తేనే ఆరోగ్యంగా ఉంటామనే విషయం తెలిసిందే. ఏ ఒక్క పోషకం తగ్గినా శరీరంలో ఏదో ఒక సమస్య మొదలవుతుంది. అయితే శరీరానికి పోషకాలు లభించడం లేదన్న విషయం ఎలా తెలుసుకోవాలనే సందేహం రావడం సర్వసాధారణం. కానీ శరీరం ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. శరీరంలో పలానా పోషకలోపం ఉందని చెప్పేందుకు కొన్ని సంకేతాలను ఇస్తుంటుంది. అలాంటిదే జింక్‌ ఒకటి.

శరీరానికి తప్పకుండా కావాల్సిన పోషకాల్లో జింక్‌ ఒకటి. ఇది శరీరానికి చాలా ముఖ్యమైన ఖనిజం. శరీరానికి కావాల్సిన జింక్‌ అందాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఓట్స్‌, గుమ్మడి గింజలు, జీడిపప్పు, వాల్‌నట్స్‌ వంటివాటిని కచ్చితంగా తీసుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కచ్చితంగా జింక్‌ లోపాన్ని జయించవచ్చు. ఇంతకీ శరీరంలో జింక్‌ లోపం ఉన్న విషయాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* శరీరంలో జింక్‌ లోపిస్తే ఆకలి తగ్గుతుంది. ఆహారం తీసుకోవాలనించదు. అలాగే రుచి, వాసనను గుర్తించే గుణం క్రమంగా తగ్గుతుంది. ఎలాంటి కారణం లేకుండా ఆహారం తక్కువగా తీసుకుంటున్నారంటే శరీరంలో జింక్‌ లోపించినట్లే అర్థం చేసుకోవాలి.

* శరీరంలో తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తున్నా జింక్‌ లోపంగానే భావించాలి. శరీరంలో జింక్‌ తగ్గితే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో పదేపదే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బాక్టీరియా, వైరస్‌ల దాడి శరీరంపై పెరుగుతుంది.

* శరీరంలో కణ విభజన, ప్రోటీన్‌ సంశ్లేషణకు జింక్‌ అవసరం. ఇది గాయాలను నయం చేయడంలో పనిచేస్తుంది. త్వరగా గాయాలు నయం కాకపోతున్నా శరీరంలో తగినంత జింక్‌ లేదని అర్థం చేసుకోవాలి.

* ఇక జింక్‌ లోపిస్తే చర్మ ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. శరీరంపై ఎర్రటి దద్దుర్లు, మచ్చలు, మొటిమలు కనిపిస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే, మీ శరీరంలో జింక్ లోపం తలెత్తకుండా చూసుకోవాలి.

* జుట్టు రాలుతున్నా శరీరంలో జింక్‌ లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. జుట్టు రంధ్రాల ఆరోగ్యానికి అవసరమైన DNA, RNA ఉత్పత్తికి జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో జింక్‌ లోపిస్తే జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి…

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్