Almonds: బాదం తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా.? ఇందులో నిజం ఎంత.?
బాదం పప్పులో నూనె ఉంటుందనేది నిజమే అయినప్పటికీ కొలెస్ట్రాల్ మాత్రం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బాదం తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు అంటున్నారు. అయితే బాదంను నెయ్యిలో వేయించుకొని తీసుకుంటే మాత్రం కొలెస్ట్రాల్ పెరగడం ఖాయమని చెబుతున్నారు. మరి బాదంను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
బాదం పప్పుతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలోని ఫాస్ఫరస్, రాగి, ఇనుము, మెగ్నీషియం వంటివి ఆరోగ్యాన్ని కాపడుతాయి. అయితే బాదంను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని కొందరు భావిస్తుంటారు. ఇంతకీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
బాదం పప్పులో నూనె ఉంటుందనేది నిజమే అయినప్పటికీ కొలెస్ట్రాల్ మాత్రం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బాదం తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు అంటున్నారు. అయితే బాదంను నెయ్యిలో వేయించుకొని తీసుకుంటే మాత్రం కొలెస్ట్రాల్ పెరగడం ఖాయమని చెబుతున్నారు. మరి బాదంను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* బాదంలో మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజు రెండు బాదంలను తీసుకోవాలని సూచిస్తున్నారు.
* ఎముకలను బలంగా మార్చడంలో బాదం పప్పు ఉపయోగపడుతుంది. ఇందులోని క్యాల్షియం, విటమిన్ ఇ ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎముకలతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది.
* బాదంను పొట్టు తీయకుండా తీసుకుంటే మరింత మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. గుండెను కాపాడే ఫ్లావనాయిడ్లు ఈ పొట్టులోనే ఎక్కువగా ఉంటాయి.
* మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా బాదం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి.
* షుగర్ పేషెంట్స్‌కి కూడా బాదం దివ్యౌషధంగా చెప్పొచ్చు. ఇందులోని మెగ్నీషియం రక్తంలోని చక్కెరల్ని అదుపు చేస్తుంది. తద్వారా ఆహారం ఎక్కువగా తినాలన్న కోరిక తగ్గుతుంది.
* శరీరంలో చెడు కొవ్వుల్ని కరిగించడంలో కూడా బాదం ఉపయోగపడుతుంది. అలాగే మంచి కొవ్వుల్ని పెంపొందిస్తుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
* బాదంను రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకుంటే మరింత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నానబెట్టడం వల్ల లైపేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తవుతుంది. ఇది మన ఆహారం ద్వారా తీసుకున్న కొవ్వులు కరిగేందుకు దోహదపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..