AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life style: ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ మానేస్తున్నారా.? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు

ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ చేయడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యకరమైన జీవనానికి ఉదయాన్నే టిఫిన్‌ చేయడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం జీవన విధానం మారింది. గజిబిజీగా మారిన జీవితంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్‌ చేస్తోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది...

Life style: ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ మానేస్తున్నారా.? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు
Skip Breakfast
Narender Vaitla
|

Updated on: Oct 09, 2024 | 5:17 PM

Share

ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ చేయడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యకరమైన జీవనానికి ఉదయాన్నే టిఫిన్‌ చేయడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం జీవన విధానం మారింది. గజిబిజీగా మారిన జీవితంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్‌ చేస్తోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇంతకీ బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేయడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఉదయం టిఫిన్‌ స్కిప్‌ చేసే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టిఫిన్‌ తీసుకోవడం మానేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్లు తిరగడం, బలహీనత వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

* ఉదయం అల్పాహారం మానేయడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అనేక తీవ్రమైన వ్యాధులకు ఇది కారణమవుతుందని అంటున్నారు. ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల కణాలు దెబ్బతింటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.

* బరువు పెరగడానికి కూడా టిఫిన్‌ స్కిప్‌ చేయడం ఒక కారణని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం తీసుకొని వారు మధ్యాహ్న భోజనంలో ఎక్కువ మంది భోజనం చేస్తారని ఇది బరువు పెరగడానకి కారణమవుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

* ఉదయం టిఫిన్‌ తీసుకోవడం మానేస్తే జీవక్రియ మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు ఇది దారి తీస్తుంది. శరీర మెటబాలిజం తగ్గడం వల్ల జీవక్రియ రేటు తగ్గుతుందని అంటున్నారు.

* మైగ్రేన్‌ వంటి సమస్యలకు కూడా టిఫిన్‌ స్కిప్‌ చేయడం ఒక కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువసేపు ఆకలితో ఉండడం తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

* ఇక ఉదయం టిఫిన్‌ మానేసి వారిలో జంక్‌ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్‌ తినాలనే కోరిక పెరుగుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది ఆరోగ్యంపై తీత్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఉబకాయం మొదలు.. అల్సర్‌, గ్యాస్‌ సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం మంచి అలవాటు కాదని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

పవన్ కల్యాణ్ పక్కన చేసినా లక్‌ దక్కని ఐదుగురు హీరోయిన్లు!
పవన్ కల్యాణ్ పక్కన చేసినా లక్‌ దక్కని ఐదుగురు హీరోయిన్లు!
1 లక్ష రూపాయలు 6 కోట్లు అయ్యింది.. ధనవంతులను చేసిన స్టాక్‌!
1 లక్ష రూపాయలు 6 కోట్లు అయ్యింది.. ధనవంతులను చేసిన స్టాక్‌!
భారీగా ఎగిసిపడిన మంటలు .. 10 పడవలు దగ్ధం.. అసలు ఏం జరిగిందంటే..?
భారీగా ఎగిసిపడిన మంటలు .. 10 పడవలు దగ్ధం.. అసలు ఏం జరిగిందంటే..?
90 సినిమాల్లో నటించిన హీరోయిన్​.. పెళ్లికి మాత్రం నో!
90 సినిమాల్లో నటించిన హీరోయిన్​.. పెళ్లికి మాత్రం నో!
ఇదెక్కడి దారుణం.. చికెన్ ముక్క ఇరుక్కొని ఆటో డ్రైవర్ మృతి
ఇదెక్కడి దారుణం.. చికెన్ ముక్క ఇరుక్కొని ఆటో డ్రైవర్ మృతి
కల్కి2లో దీపిక స్థానంలో స్టార్ హీరోయిన్.. ఎంతవరకు సాధ్యం?
కల్కి2లో దీపిక స్థానంలో స్టార్ హీరోయిన్.. ఎంతవరకు సాధ్యం?
ప్రభాస్​ సినిమా ప్లాప్​ అవడానికి ఆ హీరోనే కారణమా?
ప్రభాస్​ సినిమా ప్లాప్​ అవడానికి ఆ హీరోనే కారణమా?
గంభీర్‌ను చూసి ఎక్స్‌ప్రెషన్ మార్చేసిన కోహ్లీ..అసలు ఏం జరుగుతోంది
గంభీర్‌ను చూసి ఎక్స్‌ప్రెషన్ మార్చేసిన కోహ్లీ..అసలు ఏం జరుగుతోంది
రాత్రి వేళల్లో తినకూడని ఫ్రూట్స్ ఇవే!
రాత్రి వేళల్లో తినకూడని ఫ్రూట్స్ ఇవే!
యోగాతో గుండెపోటుకు చెక్.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన అద్భుత ఆసనాలు
యోగాతో గుండెపోటుకు చెక్.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన అద్భుత ఆసనాలు