Thyroid: థైరాయిడ్కి ఈ పండ్లతో చెక్.. ఇట్టే అదుపులోకి వస్తుంది.. పూర్తి వివరాలు..
థైరాయిడ్ వ్యాధి లక్షణాలను నిర్వహించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వైద్యుల సిఫారసు మేరకు కొన్ని మందులు వాడుతూ దానితో పాటు మంచి ఆహారం తీసుకుంటే గుణం కచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని పండ్లు రోజూ తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మనిషి జీవన శైలి మారిపోయింది. శారీరక కష్టం తగ్గిపోతోంది. అధిక శాతం డెస్క్ టాప్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఫలితంగా నిశ్చల జీవన శైలికి అలవాటు పడుతున్నారు. వ్యాయామానికి కూడా దూరమవుతున్నారు. ఫలితంగా శారీరాన్ని రోగాలమయం చేసుకుంటున్నారు. దీనికి తోడు కొన్ని ఆహారపు అలవాట్లు పరిస్థితిని మరింత దిగజార్చేలా చేస్తున్నాయి. ఫలితంగా శరీరంలో మెటబాలిక్ సిండ్రోమ్ ఏర్పడుతోంది. దీని వల్ల థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రోగాలు చుట్టుముడుతున్నాయి. థైరాయిడ్ అనేది ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది మెడ దిగువ భాగంలో ఉంటుంది. ఇది చిన్న అవయవమే అయినప్పటికీ, ఇది మన శరీరంలో చాలా కీలకమైన పాత్రలను పోషిస్తుంది. ఈ గ్రంధి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. గ్రంధి ఉత్పత్తి చేసే హార్మోన్ల పరిమాణంలో ఏదైనా అసమతుల్యత వస్తే అలసట, జుట్టు రాలడం, బరువు పెరగడం, చలిగా అనిపించడం వం టి లక్షణాలతో పాటు నీరసం మనిషిని ఆవరిస్తుంది.
ఆహారం ప్రభావితం చేస్తుందా..
థైరాయిడ్ వ్యాధులలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. అందులో ఒకటి హైపోథైరాయిడిజం (తక్కువ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి). రెండేదో హైపర్ థైరాయిడిజం (ఎక్కువ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి). థైరాయిడ్ గ్రంధి పని చేసే విధానాన్ని ప్రభావితం చేసే వివిధ వ్యాధుల వల్ల రెండు పరిస్థితులు ఏర్పడతాయి. థైరాయిడ్ వ్యాధి లక్షణాలను నిర్వహించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాస్తవానికి ఎంత పోషకాహారం తీసుకున్నా.. సమతుల్య ఆహారం అలవాటు చేసుకున్నా.. అది థైరాయిడ్ సమస్యను పరిష్కరించలేదు. కానీ వైద్యుల సిఫారసు మేరకు కొన్ని మందులు వాడుతూ దానితో పాటు మంచి ఆహారం తీసుకుంటే గుణం కచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని పండ్లు రోజూ తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యను తగ్గించవచ్చు. ఆ పండ్లేంటో చూద్దాం రండి..
యాపిల్.. ఇది ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల బరువు పెరగకుండా నిరోధించవచ్చు. మీ రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించవచ్చు. మీ థైరాయిడ్ గ్రంధిని యాక్టివ్ గా ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేయడానికి ఆపిల్ సహకరిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యాపిల్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి.
బెర్రీలు.. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల, బెర్రీలు మీ థైరాయిడ్ సమస్యపై బాగా పనిచేస్తాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని ఉత్తేజపరిచి, సజావుగా పనిచేసేలా చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి మనలను రక్షించే విటమిన్లు, ఖనిజాలను కూడా బెర్రీస్ కలిగి ఉంటాయి. మీరు మధుమేహం, బరువు పెరుగటంతో బాధపడుతున్నట్లయితే, బెర్రీలు మీకు బెస్ట్ ఎంపికలు. ప్రతిరోజూ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లేదా ఇండియన్ జుజుబ్ (బెర్) లేదా వైల్డ్ బ్లూబెర్రీస్ (ఫాల్స్)లో కొంత భాగాన్ని తీసుకోండి.
నారింజలు.. విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న నారింజలు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. మీ కణాలను మరింత దెబ్బతినకుండా కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ థైరాయిడ్ గ్రంధిలో మంటను కలిగిస్తాయి. దాని పనితీరును ప్రభావితం చేస్తాయి. విటమిన్ సీ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహిస్తుంది. చర్మం దెబ్బతినకుండా చేస్తుంది. గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.
పైనాపిల్.. దీనిలో అధిక మొత్తంలో విటమిన్ సీ మరియు మాంగనీస్ ఉంటాయి. ఈ రెండు పోషకాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. ఈ చిక్కని పండులో విటమిన్ బీ కూడా ఉంటుంది. ఇది థైరాయిడ్ లక్షణాలలో ఒకటైన అలసటను పోగొట్టడంలో సహాయపడుతుంది. పైనాపిల్ తీసుకోవడం క్యాన్సర్, ట్యూమర్, మలబద్ధకంతో బాధపడేవారికి కూడా మంచిది.
వీటికి మాత్రం దూరంగా ఉండాల్సిందే.
థైరాయిడ్ గ్రంధి యొక్క సామర్థ్యం విషయానికి వస్తే, మీరు గోయిట్రోజెన్లను కలిగి ఉన్న కొన్ని ఆహారాలను నివారించాలి. ఇలాంటి ఆహారాలు మితంగా తినాలి. అంతేకాకుండా, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కూడా పరిమితంగా తీసుకోవాలి. అవేంటో చూద్దాం..
అత్యంత ప్రాసెస్ చేసినఆహారాలు.. కేక్, కుకీలు, చిప్స్
సోయా ఆధారిత ఆహారాలు.. టోఫు, టేంపే, ఎడామామ్ బీన్స్, సోయా పాలు మొదలైనవి.
కొన్ని పండ్లు.. పీచెస్, బేరి
పానీయాలు.. కాఫీ, గ్రీన్ టీ, ఆల్కహాల్
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..