AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khereshwar Dham: శివయ్య మహిమలు చూపే ఆలయం.. రాత్రి అశ్వత్థామ పూజలు సాక్ష్యంగా పొద్దున్నే పువ్వులు, బిల్వపత్రాల దర్శనం..

అశ్వత్థామ పూజలు చేసే వాడని.. ఇప్పటికి రాత్రి పూజ కోసం వస్తాడని ఓ విశ్వాసం. ఈ అతిపురాతన శివాలయం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని శివరాజ్‌పూర్‌లో ఉంది. దీనిని ఖేరేశ్వర్ ధామ్‌ అని అంటారు. రాత్రి శివాలయానికి తలుపు వేసిన తర్వాత ఎవరో లోపల శివుడిని పూజిస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయని ఆలయ పూజారులు, ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు..

Khereshwar Dham: శివయ్య మహిమలు చూపే ఆలయం.. రాత్రి అశ్వత్థామ పూజలు సాక్ష్యంగా పొద్దున్నే పువ్వులు, బిల్వపత్రాల దర్శనం..
Khereshwar Dham
Surya Kala
|

Updated on: Jul 07, 2023 | 1:09 PM

Share

త్రిమూర్తుల్లో లయకారుడు శివుడుకి మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడా దేవాలయాలున్నాయి. ప్రకృతిలో ఉన్న దేవాలయాలు కొన్ని అయితే ఋషులు, రాజులు, భక్తులు, మానవ నిర్మిత ఆలయాలు ఉన్నాయి. అయితే కొన్ని శివాలయాలు యుగాల నుంచి ఉన్నాయని భక్తుల విశ్వాసం. అలాంటి ఒక శివ ఆలయం ద్వాపర యుగం నుంచి ఉన్నదని.. ఇక్కడ అశ్వత్థామ పూజలు చేసే వాడని.. ఇప్పటికి రాత్రి పూజ కోసం వస్తాడని ఓ విశ్వాసం. ఈ అతిపురాతన శివాలయం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని శివరాజ్‌పూర్‌లో ఉంది. దీనిని ఖేరేశ్వర్ ధామ్‌ అని అంటారు.

రాత్రి శివాలయానికి తలుపు వేసిన తర్వాత ఎవరో లోపల శివుడిని పూజిస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయని ఆలయ పూజారులు, ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇలాంటి అనుభూతి ఒక్కసారి, రెండు సారు కాదు.. అనేక చాలాసార్లు జరిగింది. అంతేకాదు శివాలయం తలపులు తెల్లవారుజామున తెరిచి చూస్తే.. శివలింగంపై అడవి పువ్వులు, బిల్వ పాత్రలను సమర్పించినట్లు ఉంటాయని.. చెబుతున్నారు పూజారులు.

శ్రావణ మాసంలో ఖేరేశ్వర్ ధామ్‌ ఆలయంలోని శివుడిని ఆరాధించడానికి లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు. ఈ ఆలయం సుమారు తమకు తెలిసి ఏడు వందల సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ ఆలయం గురించి అనేక పురాణాలు ఉన్నాయి. ఒక గొర్రెల కాపరి తన ఆవులను మేపడానికి ఇక్కడికి వచ్చేవాడని ఇక్కడి స్థానిక ప్రజలు ఒక కథను చెబుతారు.

ఇవి కూడా చదవండి

 శివలింగానికి స్వయంగా పాలు సమర్పించిన ఆవు  ప్రస్తుతం శివలింగం ఎక్కడ ఉందో.. ఆ స్థలంలోనే ఒక గొర్రెల కాపరి తన ఆవుల మందను మేపుకునేవాడు. ఒక ఆవు ఇక్కడ శివలింగానికి పాలను సమర్పించింది. ఇలా ఆవు చాలాసార్లు చేసింది. ఇది చూసి గొర్రెల కాపరి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అతను ఆ స్థలాన్ని తవ్వగా క్రింద ఒక శివలింగం కనిపించింది. అప్పటి నుంచి  శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇక్కడ శివలింగానికి జలాభిషేకం, పాల అభిషేకం అత్యంత ఫలవంతం అని భక్తుల విశ్వాసం. ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలను శివయ్య తీరుస్తాడని నమ్మకం.

పావురాల జంటల దర్శనం శుభప్రదం ఇక్కడి గర్భగుడిలో పావురాల జంట దర్శనం శుభప్రదం, ఫలప్రదం అని ఆలయ సేవదారు కమలేష్ బాబా చెప్పారు. పావురాల జంటలు స్వయంగా ఆలయానికి వచ్చి శివలింగం ముందు గంటల తరబడి కూర్చుని ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).