Low BP: లోబీపీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా.?

ప్రస్తుతం హైబీపీతో సమానంగా లోబీపీ సమస్య కూడా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశంలోని ప్రతీ నలుగురిలో ఒకరు రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. గతేడాది జూన్‌లో ICMR-ఇండియా మధుమేహం అధ్యయనంలో దేశంలో 3 కోట్ల మందికి పైగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని వెల్లడైంది. అధిక బీపీ గుండెకు మాత్రమే ప్రమాదకరం...

Low BP: లోబీపీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా.?
Low Bp
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 10, 2024 | 4:36 PM

రక్తపోటు.. ఇటీవల ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఒకటి. మారిన జీవిన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు అనగానే ఎక్కువగా అధిక రక్తపోటు గురించే ఆలోచిస్తాం. కానీ లోబీపీ కూడా ప్రమాదకరమని మీకు తెలుసా.? ఒక రకంగా చెప్పాలంటే లోబీపీ స్లో పాయిజన్‌గా వ్యాపిస్తుంది. లోబీపీ మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం హైబీపీతో సమానంగా లోబీపీ సమస్య కూడా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశంలోని ప్రతీ నలుగురిలో ఒకరు రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. గతేడాది జూన్‌లో ICMR-ఇండియా మధుమేహం అధ్యయనంలో దేశంలో 3 కోట్ల మందికి పైగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని వెల్లడైంది. అధిక బీపీ గుండెకు మాత్రమే ప్రమాదకరం (హై బ్లడ్ ప్రెజర్ రిస్క్) అని చాలా మంది అనుకుంటారు. అయితే లోబీపీ కారణంగా శరీరంలో ఏయే అవయవాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా పనిచేస్తున్న సమయంలో అలసిపోవడం సర్వసాధారణం. అయితే చిన్న చిన్న పనులకే అలసిపోతున్నా. నీరసంగా ఉంటున్నా, ప్రతీ పనికి విసుగుచెందుతున్నా లోబీపీ సమస్యతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలి.

* ఉన్నపలంగా పడుకొని లేచినా, కూర్చుని లేచిన సమయంలో కళ్లు తిరుగుతున్నట్లు అనిపించినా.. తల తిరుగుతున్నట్లున్న లోబీపీతో బాధపడుతున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇక లోబీపీతో బాధపడేవారిలో తల ఎప్పుడూ తల దిమ్ముగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిత్యం తలనొప్పిగా ఉన్న భావన కలుగుతుంది.

* లోబీపీతో బాధపడేవారిలో నిత్యం వికారంగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే వికారం, ఏకాగ్రత లోపించడం, కంటి చూపు మందగించినట్లు అనిపిస్తున్నా రక్తపోటు తగ్గినట్లు అర్థం చేసుకోవాలి.

* శరీరంలో నిత్యం నొప్పులు, వాపులు కనిపిస్తున్నా అవి లోబీపీ లక్షణాలుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక లోబీపీ ఉన్న వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. నిత్యం గందరగోళానికి గురవుతుంటారు.

* రక్తపోటు తగ్గితే.. చర్మం రంగు మారుతుంది. శ్వాస, పల్స్‌లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అందిరిలో ఇవే లక్షణాలు ఉంటాయని స్పష్టంగా చెప్పలేము కానీ మెజారిటీలో మాత్రం ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!