Blue Banana: మీకు బ్లూ బనానా గురించి తెలుసా.? లాభాలు అమోఘం..

సాధారణంగా మనకు తెలిసినంత వరకు అరటి పండు ఎల్లో కలర్‌లో ఉంటుంది. అయితే ఎప్పుడైనా బ్లూ అరటి పండు గురించి విన్నారా.? అవును బ్లూ బనానా కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయని మీలో ఎంత మందికి తెలుసు. సాధారణ అరటి పండుతో పోల్చితే ఈ బ్లూ అరటి పండుతో ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు...

Blue Banana: మీకు బ్లూ బనానా గురించి తెలుసా.? లాభాలు అమోఘం..
Blue Banana
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 11, 2024 | 8:36 PM

సాధారణంగా మనకు తెలిసినంత వరకు అరటి పండు ఎల్లో కలర్‌లో ఉంటుంది. అయితే ఎప్పుడైనా బ్లూ అరటి పండు గురించి విన్నారా.? అవును బ్లూ బనానా కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయని మీలో ఎంత మందికి తెలుసు. సాధారణ అరటి పండుతో పోల్చితే ఈ బ్లూ అరటి పండుతో ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బ్లూ జావా అరటిపండుగా పీలచుకునే ఈ పండు.. ఆగ్నేయాసియాలో సాగు చేస్తారు. ఇది కాకుండా, ఈ అరటిని హవాయి దీవులలో కూడా సాగు చేస్తారు. ఇది ఎక్కువగా చల్లని ప్రాంతాల్లో పండుతాయి. బ్లూ బనానా ఐస్‌క్రీమ్‌ రుచిని పోలి ఉంటుంది. అచ్చంగా వెనిలా ఫ్లేవర్‌తో కూడిన రుచి దీని సొంతం. ఇంతకీ బ్లూ బనానా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* బ్లూ అరటిపండులో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్‌ సమస్య దరిచేరకుండా చేస్తుంది. ఐరన్‌ లోపంతో బాధపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

* మలబద్ధకంతో బాధపడేవారికి కూడా బ్లూ అరటి పండు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తరిమికొట్టడంలో దోహదపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఈ అరటి బాగా ఉపయోగపడుతుంది.

* మానసిక సమస్యలను దూరం చేయడంలో కూడా బ్లూ బనానా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని రిలాక్స్డ్ మోడ్‌లోకి తీసుకెళ్లేందుకు దోహదనడపతుంది. దీంతో డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. విటమిన్ B6 రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని సాధారణంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

* శరీరానికి అవసరమయ్యే శక్తిని అదించడంలో బ్లూ బనానా బాగా ఉపయోగంగా ఉంటుంది. ఈ పండును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటుంది. నీరసం నుంచి బయటపడొచ్చు. అలాగే అనే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా బ్లూ బనానా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్‌ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో