Lifestyle: స్మార్ట్‌ఫోన్‌కు, గుండె పోటుకు మధ్య సంబంధం ఏంటి.? నిపుణులు ఏమంటున్నారంటే..

అమెరికాలంటి దేశాల్లో సగటున 45 ఏళ్లకు గుండెపోటు వస్తుంటే.. భారత్‌లో మాత్రం 35 ఏళ్ల వయసులోనే గుండెపోటు వస్తుండడం అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది. అయితే సాధారణంగా గుండెపోటు రావడానికి రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ పెరగడం వంటివే ప్రధాన కారణమని మనం భావిస్తుంటాం. అయితే స్క్రీన్‌ టైమ్‌ పెరగడం కూడా ఇందుకు ఓ సమస్యగా...

Lifestyle: స్మార్ట్‌ఫోన్‌కు, గుండె పోటుకు మధ్య సంబంధం ఏంటి.? నిపుణులు ఏమంటున్నారంటే..
Smartphone And Heart
Follow us

|

Updated on: Oct 09, 2024 | 6:00 PM

ప్రస్తుతం గుండెపోటు సమస్యలు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు కేవలం వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ఇప్పుడు చిన్న వయసులో వారిలో కూడా ఎక్కువుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సంబంధిత సమస్యలతో బారినపడుతున్నవారు ఎక్కువవుతున్నారు. మరీ ముఖ్యంగా భారత్‌లో ఈ సమస్య ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.

అమెరికాలంటి దేశాల్లో సగటున 45 ఏళ్లకు గుండెపోటు వస్తుంటే.. భారత్‌లో మాత్రం 35 ఏళ్ల వయసులోనే గుండెపోటు వస్తుండడం అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది. అయితే సాధారణంగా గుండెపోటు రావడానికి రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ పెరగడం వంటివే ప్రధాన కారణమని మనం భావిస్తుంటాం. అయితే స్క్రీన్‌ టైమ్‌ పెరగడం కూడా ఇందుకు ఓ సమస్యగా నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్‌లు, టీవీలకు గంటలతరబడి అతుక్కుపోవడం ఎక్కువవడం కూడా గుండెపోటుకు దారి తీస్తోందని నిపుణులు అంటున్నారు.

గంటలతరబడి మొబైల్‌ ఫోన్‌లకు అతుక్కుపోవడం, ల్యాప్‌టాప్‌లు, టీవీలను రోజుకు సగటున 8 నుంచి 10 గంటల చూడడం వంటివి గుండె జబ్బులు వచ్చేందుకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ఇక స్మార్ట్‌ఫోన్‌లతో పాటు వివిధ రకాల ఫుడ్‌ డెలివరి యాప్‌ల వినియోగం పెరగడం కూడా గుండె సమస్యలకు కారణంగా చెబుతున్నారు. పీజాలు, బర్గర్లతో పాటు ఇతర మాంసాహార వంటకాలను ఎక్కువగా ఆర్డర్లు పెట్టుకొని తినగడం కూడా భారత్‌లో గుండెపోటు సమస్య పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. ప్రపంచంలోనే ఫుడ్‌ ఆర్డర్లలో భారత్‌ అగ్ర స్థానంలో ఉండడం దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.

వీటితోపాటు వ్యాయామం చేయడం పూర్తిగా తగ్గడం కూడా గుండె సమస్యలు రావడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో పోల్చితే శారీరక శ్రమ పూర్తిగా తగ్గడం వల్ల కూడా గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని అంటున్నారు. గంటల తరబడి ఒకేచోట కూర్చొని పనుల కారణంగా గుండె వ్యాధులు పెరుగుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

ఇక మారిన జీవన విధానం, మారిన వర్క్‌ కల్చర్‌ కారణంగా కూడా ఈ సమస్య ఎక్కువుతోంది. మానసిక ఒత్తిడి, నిద్రలేకపోవడం వంటి సమస్యలు కూడా గుండెపోటుకు దారి తీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం, వ్యక్తిగత జీవితాల్లో తలెత్తుతోన్న సమస్యలు దీర్ఘకాలంలో మానసిక సమస్యలకు దారి తీస్తున్నాయని ఇవి పరోక్షంగా గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అంటున్నారు. అలాగే స్మోకింగ్, వాతావరణ కాలుష్యం కూడా గుండెపోటుకు కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

స్మార్ట్‌ఫోన్‌కు, గుండె పోటుకు మధ్య సంబంధం ఏంటి.?
స్మార్ట్‌ఫోన్‌కు, గుండె పోటుకు మధ్య సంబంధం ఏంటి.?
ఆ పోస్టుతో ఓలా స్టాక్ ధరలు ఢమాల్.. సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం
ఆ పోస్టుతో ఓలా స్టాక్ ధరలు ఢమాల్.. సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం
రెపో రేటు మళ్లీ మారలేదు.. లోన్ తీసుకునే వారికి ఇదే బెస్ట్ చాయిస్
రెపో రేటు మళ్లీ మారలేదు.. లోన్ తీసుకునే వారికి ఇదే బెస్ట్ చాయిస్
బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త రవీందర్.! ఆడియెన్స్‌ వెరైటీ రియాక్
బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త రవీందర్.! ఆడియెన్స్‌ వెరైటీ రియాక్
బంగ్లాకు షాకిచ్చారు.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి ఊహించని గిఫ్ట్
బంగ్లాకు షాకిచ్చారు.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి ఊహించని గిఫ్ట్
ఈ ఒక్క ఫోటో క్షణాల్లో వైరల్.. రీజన్ మాత్రం చాలా స్పెషల్‌.!
ఈ ఒక్క ఫోటో క్షణాల్లో వైరల్.. రీజన్ మాత్రం చాలా స్పెషల్‌.!
పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి ముందు..
పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి ముందు..
బ్రేక్‌ ఫాస్ట్ మానేస్తున్నారా.? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు
బ్రేక్‌ ఫాస్ట్ మానేస్తున్నారా.? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు
బాబోయ్.! ఎగిరే పామును చూశారా.? ధైర్యమున్నోళ్లే వీడియో చూడండి
బాబోయ్.! ఎగిరే పామును చూశారా.? ధైర్యమున్నోళ్లే వీడియో చూడండి
దీపావళికి ముందే శంఖాన్ని తీసుకొస్తే.. ధనలక్ష్మి విడిచి పోదు..
దీపావళికి ముందే శంఖాన్ని తీసుకొస్తే.. ధనలక్ష్మి విడిచి పోదు..
బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త రవీందర్.! ఆడియెన్స్‌ వెరైటీ రియాక్
బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త రవీందర్.! ఆడియెన్స్‌ వెరైటీ రియాక్
ఈ ఒక్క ఫోటో క్షణాల్లో వైరల్.. రీజన్ మాత్రం చాలా స్పెషల్‌.!
ఈ ఒక్క ఫోటో క్షణాల్లో వైరల్.. రీజన్ మాత్రం చాలా స్పెషల్‌.!
'మనం గుడ్‌ బుక్‌ పెడుదాం'.. మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
'మనం గుడ్‌ బుక్‌ పెడుదాం'.. మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
ఉన్నది 5 వారాలే కానీ.. డబ్బులు మాత్రం భారీగానే పట్టేసింది.!
ఉన్నది 5 వారాలే కానీ.. డబ్బులు మాత్రం భారీగానే పట్టేసింది.!
దుర్గామాత ఉత్సవాలు.. చదువుతూ గర్భా ఆడిన యువకుడు అదుర్స్‌..
దుర్గామాత ఉత్సవాలు.. చదువుతూ గర్భా ఆడిన యువకుడు అదుర్స్‌..
సీఎం రేవంత్‌ను కలిసిన మల్లారెడ్డి.. అందుకేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సీఎం రేవంత్‌ను కలిసిన మల్లారెడ్డి.. అందుకేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
బిగ్ బాస్ హౌస్‌లోకి గాడిద.. షాక్‌లో కంటెస్టెంట్స్‌ & ఆడియెన్స్..
బిగ్ బాస్ హౌస్‌లోకి గాడిద.. షాక్‌లో కంటెస్టెంట్స్‌ & ఆడియెన్స్..
మరో ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న ఉపాసన
మరో ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న ఉపాసన
కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌నే.. కుమ్మేస్తున్న దేవర..
కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌నే.. కుమ్మేస్తున్న దేవర..
వడ్డే నవీన్ భార్య.. టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని మీకు తెలుసా ??
వడ్డే నవీన్ భార్య.. టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని మీకు తెలుసా ??