Potato Uses: బంగాళదుంప తింటే బోలెడన్ని ప్రయోజనాలు.. మిస్ చేయకండి..

|

Aug 01, 2024 | 4:31 PM

బంగాళదుంపతో కర్రీలు, స్నాక్స్, వేపుళ్లు ఇలా చాలా రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంది ఎక్కువగా స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఫంక్షన్స్‌లో, హోటల్స్‌లో స్టార్టర్స్‌గా బంగాళదుంపతోనే ఎక్కువగా స్నాక్స్ చేస్తూ ఉంటారు, ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మందికి నచ్చుతాయి. అయితే చాలా మంది బంగాళదుంప తింటే వాతవ చేస్తుందని తినడం మానేస్తారు. కానీ బంగాళదుంపలో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు..

Potato Uses: బంగాళదుంప తింటే బోలెడన్ని ప్రయోజనాలు.. మిస్ చేయకండి..
Potato Uses
Follow us on

బంగాళదుంపతో కర్రీలు, స్నాక్స్, వేపుళ్లు ఇలా చాలా రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంది ఎక్కువగా స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఫంక్షన్స్‌లో, హోటల్స్‌లో స్టార్టర్స్‌గా బంగాళదుంపతోనే ఎక్కువగా స్నాక్స్ చేస్తూ ఉంటారు, ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మందికి నచ్చుతాయి. అయితే చాలా మంది బంగాళదుంప తింటే వాతవ చేస్తుందని తినడం మానేస్తారు. కానీ బంగాళదుంపలో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. బంగాళదుంప తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయట పడొచ్చు. బంగాళదుంప తనడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆలూ తింటే ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్బోహైడ్రేట్లు ఎక్కువ:

బంగాళదుంపలో కార్బోహైడ్రేట్ల శాతం ఎక్కువగా లభిస్తాయి. కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల శరీరానికి సత్వరమే శక్తి లభిస్తుంది. అలసట, నీరసం దూరం అవుతాయి. కార్బోహైడ్రేట్లు కావాలి అనుకునేవారు బంగాళదుంపలను తీసుకోవచ్చు.

ఫైబర్ అధికం:

బంగాళదుంపలో పీచు పదార్థం అనేది మెండుగా లభిస్తుంది. ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. తరచుగా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవారు బంగాళదుంపలను తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మల బద్ధకం సమస్య తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్ అవుతారు:

బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా తిన్నా పొట్ట నిండుతుంది. అంతే కాదు బంగాళ దుంపతో తయారు చేసిన స్నాక్స్ తిన్నా పెద్దగా ఆకలి వేయదు. చిరు తిళ్లు అనేవి తగ్గుతాయి. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

బంగాళదుంప తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి ఆలూని తినడం వల్ల శరీరంలోని ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. దీంతో వైరల్ ఇన్ ఫెక్షన్స్, సీజనల్ వ్యాధులు ఎటాక్ చేయకుండా ఉంటాయి.

చర్మానికి ఎంతో మంచిది:

బంగాళదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని మృదువుగా, మెరిచేలా చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై ముడతలు, నల్లటి మచ్చలు తగ్గించి.. వృద్ధాప్యం నుంచి కాపాడుతుంది. ఆలూని తినడం వల్లనే కాకుండా రాసుకోవడం కూడా చర్మ సమస్యలు తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..