AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ పేషెంట్స్ కు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం తంగేడు పువ్వు.. అమ్మమ్మల కాలం నాటి తంగేడు పువ్వు పచ్చడి రెసిపీ మీ కోసం..

తంగేడు పువ్వులో మధుర, రూక్ష, పిత్త, వాత కఫ హర గుణాలున్నట్టు ఆయుర్వేదంలో పేర్కొంది. అంతేకాదు షుగర్ పెరిగినా.. కిడ్నీ సంబంధిత వ్యాదుల నివారణ కోసం తంగేడు పువ్వులను కూరగా లేదా పచ్చడిగా చేసుకుని తినమని పెద్దలు సూచిస్తారు. ఈ రోజు రుచికరమైన తంగేడు పువ్వుల పచ్చడి తయారీ రెసిపీ తెలుసుకుందాం..

షుగర్ పేషెంట్స్ కు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం తంగేడు పువ్వు.. అమ్మమ్మల కాలం నాటి తంగేడు పువ్వు పచ్చడి రెసిపీ మీ కోసం..
Tangedu Puvvu Pachadi
Surya Kala
|

Updated on: Nov 03, 2024 | 10:36 AM

Share

తెలంగాణలో పువ్వుని పూజించే బతుకమ్మని పేర్చడానికి ఉపయోగించే పువ్వుల్లో ఒకటి తంగేడు పువ్వు. బంగారు రంగులో గుత్తులు గుత్తులుగా అందంగా కనిపించే ఈ తంగేడు పువ్వులో అనేక ఔషధ గుణాలున్నాయి. అసలు తంగేడు మొక్క అనేక ఆరోగ్య సమస్యలను తీర్చే మంచి ఔషధం.

కావల్సిన పదార్థాలు:

  1. తంగేడు పువ్వులు – ఒక కప్పు
  2. పచ్చిమిర్చి- ఎనిమిది
  3. నువ్వులు – మూడు స్పూన్లు
  4. చింతపండు౦- కొంచెం
  5. ఇవి కూడా చదవండి
  6. ఉప్పు రుచికి సరిపడా
  7. జీలకర్ర-ఒక స్పూన్
  8. వెళ్ళుల్లి – నలుగు రెమ్మలు
  9. పసుపు- చిటికెడు
  10. నూనె – నాలుగు స్పూన్లు

పోపుకు కావాల్సిన దినుసులు

  1. ఆవాలు
  2. జీలకర్ర
  3. కరివేపాకు
  4. ఎండు మిర్చి
  5. వెల్లుల్లి
  6. మినప పప్పు
  7. శనగ పప్పు

తయారీ విధానం: ముందుగా తంగేడు పువ్వును తీసుకుని పువ్వులు మాత్రమే అంటే పసుపు రంగులో ఉన్న పువ్వులను తీసుకుని శుభ్రంగా వలిచి కడగాలి. చింత పండును కొంచెం నీరు పోసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత తంగేడు పువ్వులు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ నూనేలో పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి వేసి వేయించాలి. ఇప్పుడు రోలుని శుభ్రం చేసుకుని మొదట వేయించిన పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి చింత పండు వేసి బాగా నూరాలి. తర్వాత వేయించిన తంగేడు పువ్వులను వేసి బాగా నూరు కోవాలి. ఇప్పుడు పోపుకోసం తీసుకున్న దినుసులను వేయించి.. వాటిని రెడీ చేసుకున్న తంగేడు పువ్వుల పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే తంగేడుపూల పచ్చడి రెడీ. రోలు రోకలి లేని వారు మిక్సిలో వేసుకుని కూడా పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి అన్నంలోకి ఇడ్లీ, దోశల్లోకి చాలా బాగుంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దసరాకు ఇంటికెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త.. ఛార్జీలపై పండుగే..
దసరాకు ఇంటికెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త.. ఛార్జీలపై పండుగే..
10 నిమిషాల్లో కమ్మని కంది పచ్చడి! అన్నంలో నెయ్యి వేసి తింటే అమృతం
10 నిమిషాల్లో కమ్మని కంది పచ్చడి! అన్నంలో నెయ్యి వేసి తింటే అమృతం
వరుడు కావలెను అంటూ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసిన యువతి.. క్యూ కట్టిన
వరుడు కావలెను అంటూ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసిన యువతి.. క్యూ కట్టిన
సంజూ పేలవ ఫామ్‌కు వైభవ్ కారణమా..? మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
సంజూ పేలవ ఫామ్‌కు వైభవ్ కారణమా..? మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఒకేసారి ఎంతంటే..?
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఒకేసారి ఎంతంటే..?
రాంచీ నెట్స్‌లో ఈషాన్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
రాంచీ నెట్స్‌లో ఈషాన్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
మిగిలిన అన్నంతో క్రిస్పీ కట్లెట్స్.. ఎలా చేయాలి అంటే?
మిగిలిన అన్నంతో క్రిస్పీ కట్లెట్స్.. ఎలా చేయాలి అంటే?
చలికాలంలో గుడ్లు తింటే శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి?
చలికాలంలో గుడ్లు తింటే శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. IMDB టాప్ రేటింగ్ మూవీ
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. IMDB టాప్ రేటింగ్ మూవీ
3.3 ఓవర్లలోనే మ్యాచ్‌ క్లోజ్.. 14 బంతుల్లో దూల తీర్చేసిన ప్లేయర్
3.3 ఓవర్లలోనే మ్యాచ్‌ క్లోజ్.. 14 బంతుల్లో దూల తీర్చేసిన ప్లేయర్