Walking: భోజనం తర్వాత రోజూ 100 అడుగులు వేసి చూడండి.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఇవే..

వేళా పాళా లేని లైఫ్ స్టైల్ వల్ల అనేక కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. భోజనం తిన్న వెంటనే చాలా మంది వెంటనే పడుకోవడమో లేదా ఒకే చోట కూర్చొని టీవీ చూస్తూ ఉండిపోవడమో మనం తరచు చూస్తూ ఉంటాం.

Walking: భోజనం తర్వాత రోజూ 100 అడుగులు వేసి చూడండి.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఇవే..
Benefits of walking

Edited By:

Updated on: May 24, 2023 | 9:40 AM

వేళా పాళా లేని లైఫ్ స్టైల్ వల్ల అనేక కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. భోజనం తిన్న వెంటనే చాలా మంది వెంటనే పడుకోవడమో లేదా ఒకే చోట కూర్చొని టీవీ చూస్తూ ఉండిపోవడమో మనం తరచు చూస్తూ ఉంటాం. కానీ ఆహారం తిన్న వెంటనే ఒకే చోట పడుకోవడం లేదా కూర్చోవడం వల్ల చాలా తీవ్రమైన రోగాలు వస్తాయి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే బరువు పెరగడమే కాకుండా శరీరాన్ని అనేక వ్యాధులు సోకడం ప్రారంభిస్తాయి. ఆహారం తిన్న తర్వాత మనం కొంతసేపు నడవాలి, దీనివల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది తిన్న తర్వాత నడవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుందా అన్న ప్రశ్న ప్రజల్లో మెదులుతోంది. దీని గురించి తెలుసుకుందాం

మనిషి చేసే ప్రతి చిన్న పని అతని శరీరంలో ప్రభావం చూపిస్తుందని హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ కెర్షా పటేల్ అన్నారు భోజని చేసిన తర్వాత నడవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చని తెలిపారు.

భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం మంచిదేనా?

ఇవి కూడా చదవండి

నిజానికి, భోజనం తర్వాత మనం నడిచినప్పుడల్లా, మన శరీరం చురుకుగా మారుతుంది, దీని కారణంగా శరీరం పోషకాలను గ్రహిస్తుంది. మన ఆహారం జీర్ణక్రియలో భాగంగా ముందు చిన్న ప్రేగులలో జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల కడుపు నుంచి చిన్న ప్రేగులకు ఆహారం వేగంగా చేరుతుందని పరిశోధనలో వెల్లడైంది. మన కడుపులోని ఆహారం పేగుల్లోకి వెళ్లగానే కడుపు ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ వంటి సాధారణ సమస్యలేవీ రావు అని పరిశోధనలు తేల్చాయి. దీని ప్రకారం భోజనం తర్వాత 30 నిమిషాలు నడవడం, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఇది మలబద్ధకం అవకాశాలను తగ్గిస్తుంది.

ఒకటి కాదు ఎన్నో ప్రయోజనాలు:

తిన్న తర్వాత నడవడం వల్ల శరీరం చురుగ్గా మారి ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఏదైనా శారీరక శ్రమ చేయడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్ లేదా ఫీల్‌గుడ్ హార్మోన్ విడుదల అవుతుంది, దాని వల్ల మన శరీరం ఉపశమనం పొందుతుంది. నడక తర్వాత నిద్ర కూడా బాగుంటుంది. దీని వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా, తిన్న తర్వాత నడవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, బ్లడ్ షుగర్ మెయింటెయిన్ అవుతుంది, డిప్రెషన్ సమస్య ఉండదు బరువు కూడా మెయింటైన్ అవుతుంది.

ఎంత సేపు నడవాలి:

భోజనం చేసిన తర్వాత కనీసం 20 నిమిషాల పాటు నడవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు ఆహారం తీసుకున్న వెంటనే నడవాలి, గ్యాప్ తీసుకున్న తర్వాత కాదని గుర్తుంచుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం