Hair Loss Prevention Tips: మీకూ పట్టుకుచ్చులాంటి జుట్టు కావాలా? అయితే మీ ఆహారంలో ఇవి తీసుకోండి..

జుట్టు సంరక్షణ కోసం చాలా మంది ప్యాక్‌లు, సీరమ్‌లు, నూనెలు వంటి ఎన్నో వాడుతుంటారు. అయితే కొన్నిసార్లు ఎన్ని వాడినా ఫలితం ఉండదు. దీనికి కారణం జుట్టు లోపలి నుండి పోషణ అందకపోవడం. అంటే, మొదట జుట్టు మూలాల నుంచి బలోపేతం చేయాలి. దానిని సరిగ్గా పోషించాలి. అప్పుడే జుట్టు సమస్యలు పరిష్కారమవుతాయి. అప్పుడే అవి మందంగా, ఆరోగ్యంగా..

Hair Loss Prevention Tips: మీకూ పట్టుకుచ్చులాంటి జుట్టు కావాలా? అయితే మీ ఆహారంలో ఇవి తీసుకోండి..
Hair Loss Prevention Tips

Updated on: Jul 15, 2025 | 7:00 AM

జుట్టును పట్టుకుచ్చులా పెంచుకోవడం అంత సులువుకాదు. ఇందుకోసం ప్రతిరోజూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. అందుకే జుట్టు సంరక్షణ కోసం చాలా మంది ప్యాక్‌లు, సీరమ్‌లు, నూనెలు వంటి ఎన్నో వాడుతుంటారు. అయితే కొన్నిసార్లు ఎన్ని వాడినా ఫలితం ఉండదు. దీనికి కారణం జుట్టు లోపలి నుండి పోషణ అందకపోవడం. అంటే, మొదట జుట్టు మూలాల నుంచి బలోపేతం చేయాలి. దానిని సరిగ్గా పోషించాలి. అప్పుడే జుట్టు సమస్యలు పరిష్కారమవుతాయి. అప్పుడే అవి మందంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. లేదంటే జుట్టుకు ఎన్ని మాస్క్‌లు, ప్యాక్‌లు, సీరమ్‌లు అప్లై చేసినా పెద్దగా ప్రభావం ఉండదు. కాబట్టి జుట్టును పోషించడానికి ఏమి చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి సందేహాలకు నిపుణుల సూచనాలు ఇక్కడ తెలుసుకుందాం..

జుట్టు రాలడానికి కారణాలు ఏమిటి?

సాధారణంగా జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిలో ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపాలు, హార్మోన్ల మార్పులు, చెడు అలవాట్లు ఉన్నాయి. ఈ కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలుతుంది.

పురుషులలో జుట్టు రాలడం

పురుషులలో జుట్టు రాలడం సర్వసాధారణం. జుట్టు రాలడమే కాదు, బట్టతల కూడా వస్తుంది. దీన్ని వదిలించుకోవడానికి సమస్య మూలాన్ని కనుగొనాలి. సాధారణంగా పురుషులలో జుట్టు రాలడం డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్ల వస్తుంది. కాబట్టి ఆహారంలో జుట్టు పెరుగుదలకు సహాయపడే ఆహారాలను పెంచడంతో పాటు, జుట్టు రాలడాన్ని తగ్గించే ఆహారాలను కూడా తినాలి. అటువంటి ఆహారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు

ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు సాధారణంగా అనేక రకాల ఆహారాలలో కనిపిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దీని కోసం, మాంసాహారులు తమ ఆహారంలో సాల్మన్, సార్డిన్‌ వంటి చేపలను చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ చేపలలో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, వాటిని క్రమం తప్పకుండా తినాలి. శాఖాహారులకు అవిసె గింజలు, చియా గింజలు, వాల్‌నట్‌లు మంచి వనరులు.

ఎంత మోతాదులో తీసుకోవాలి?

ప్రతిరోజూ 1 టేబుల్ స్పూన్ చియా గింజలు, 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు లేదా 7 వాల్‌నట్స్ తీసుకోవాలి. మీరు ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు 3 నుంచి 6 నెలల్లో మందంగా పెరుగుతుంది. ఇది జుట్టు రాలడాన్ని 90% తగ్గించడంలో సహాయపడుతుంది. మీ జుట్టు మందంగా, నిండుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఖరీదైన నూనెలు, ప్యాక్‌లను ఉపయోగించే బదులు ఈ రకమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.