AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Health Tips: మీరు నాన్ వెజ్ ప్రియులా.. వేసవిలో మాంసాహారంతో వీటిని కలిపి తినాలి.. ఎందుకంటే..

వేసవి కాలంలో ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చాలా అవసరం. శరీరానికి చల్లదనాన్ని అందించేవి చేర్చుకోవాలి. అయితే వేసవిలో నాన్ వెజ్ తినవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. రోజూ నాన్-వెజ్ తినడం ఇష్టం అయితే.. ఇంకా చెప్పాలంటే ముక్క లేనిదే ముద్ద దిగదు అనిపిస్తే వేసవిలో రోజూ నాన్ వెజ్ తినడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అప్పుడు నాన్ వెజ్ తినే సమయంలో ఈ ఆహారాలను జత చేసుకోండి. శరీర వేడి పెరగదు.

Summer Health Tips: మీరు నాన్ వెజ్ ప్రియులా.. వేసవిలో మాంసాహారంతో వీటిని కలిపి తినాలి.. ఎందుకంటే..
Non Veg
Surya Kala
|

Updated on: May 15, 2025 | 2:06 PM

Share

చాలా మందికి నాన్-వెజ్ ఫుడ్ తినడమంటే చాలా ఇష్టం. అందులోనూ చికెన్, మటన్, చేప, గుడ్డు, రొయ్యలు వంటి వివిధ ఆహార పదార్ధాలను తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. మాంసం, చేపలు , గుడ్లు ప్రోటీన్ కి మంచి వనరులు. ఇవి కండరాలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. శాఖాహార ఆహారం కంటే మాంసాహార ఆహారంలోనే విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. దీనితో పాటు ఐరెన్, జింక్, విటమిన్ డి సహా అనేక ఇతర విటమిన్లు లభిస్తాయి. చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇది మెరిసే చర్మానికి అలాగే మెదడు, గుండె ఆరోగ్యానికి అవసరం.

చాలా మంది రోజూ లేదా రెండు రోజులకు ఒకసారి నాన్-వెజ్ తినడానికి ఇష్టపడతారు, ముఖ్యంగా ఫిట్‌నెస్ ఫ్రీక్స్, దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని వారు భావిస్తారు. అయితే రోజూ లేదా అధికంగా నాన్-వెజ్ తినడం కూడా ఆరోగ్యానికి హానికరం, ముఖ్యంగా వేసవి కాలంలో దీనిని పరిమిత పరిమాణంలో తినాలి. నాన్ వెజ్ ప్రియులకు నిపుణుల సలహా ఏమిటంటే..

వేసవిలో ఎక్కువగా నాన్-వెజ్ తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏమిటంటే

ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్ మాట్లాడుతూ.. ఎక్కువగా నాన్-వెజ్ తినడానికి ఇష్టపడి వేసవిలో కూడా మాంసాహారం అధిక పరిమాణంలో తినేవారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నాన్-వెజ్ శరీరంలో వేడిని పెంచుతుంది. అంతేకాదు అజీర్ణం, ఆమ్లత్వం, అలసట వంటి సమస్యలను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

వేసవిలో నాన్-వెజ్ తో వీటిని తినండి

  1. అయితే నాన్-వెజ్ తో పాటు చల్లదనం అందించే పదార్థాలు తింటే.. ఈ సమస్యలను నివారించవచ్చు. వేసవిలో ఖచ్చితంగా నాన్-వెజ్ తో పెరుగు తినండి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో పాటు శరీరాన్ని చల్లబరుస్తుంది.
  2. రెండవది పుదీనా.. ఇది రుచిని పెంచడమే కాదు శరీరాన్ని చల్లబరుస్తుంది.
  3. మూడవది నిమ్మకాయ. నాన్-వెజ్ ఆహారం పై కొన్ని చుక్కల నిమ్మరసం జోడించడం వలన తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
  4. నాల్గవది కీర దోస ఇది శరీరంలో హైడ్రేషన్‌ను నిర్వహిస్తుంది. శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది.
  5. ఐదవ విషయం మజ్జిగ లేదా పాలవిరుగుడు. ఇది కడుపుని చల్లబరుస్తుంది. ఎక్కువ మొత్తంలో ఆహారం తర్వాత ఉపశమనం కలిగిస్తుంది.
  6. వీటిలో దేనినైనా నాన్-వెజ్ తో పాటు కలిపి తినడం వలన వేసవిలో కూడా మీరు ఇష్టాన్ని తీర్చుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు.
  7. అయితే వేయించిన, అధిక కారంతో ఉండే నాన్-మాంసాహారం తినకుండా ఉండండి.
  8. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి రోజంతా పుష్కలంగా నీరు త్రాగండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)