
వేసవి కాలం వచ్చేసింది. రోజు రోజుకీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు తమ జీవనశైలిని , తినే ఆహారాన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా కొవ్వును కరిగించుకోవాలనుకునే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరక అలవాట్లు పూర్తిగా ప్రభావితమవుతాయి. బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామంతో పాటు కొన్ని ఆరోగ్యకరమైన విషయాలను తమ ఆహారంలో చేర్చుకోవచ్చని పోషకాహార నిపుణుడు న్మామి అగర్వాల్ అంటున్నారు. తక్కువ కేలరీల కంటెంట్ కారణంగా.. కొవ్వును బర్న్ చేసే ప్రక్రియలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవిలో ఆహారంలో ఏమీ చేర్చుకోవాలో తెలుసుకుందాం.
వేసవిలో తినే ఆహారంలో పుచ్చకాయను చేర్చుకోండి. ఈ పండులో 90శాతం వరకూ నీరు ఉంటుంది. ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు, కడుపు నిండిన అనుభూతిని కూడా కలిగిస్తుంది. అంతేకాదు సలాడ్‌లో కీర కాయను చేర్చుకోవచ్చు. నారింజ, నిమ్మ, జామ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి జీవక్రియను పెంచుతాయి. ఇవి కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
పెరుగు వేసవి నుంచి ఉపశమనం ఇస్తుంది. పెరుగులో ప్రోటీన్, కాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇది జీర్ణక్రియకు, ఎముకలు, దంతాలు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు పెరగకుండా నిరోధించడంలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడానికి సహాయపడతాయి.
గ్రీన్ టీ వంటి హెర్బల్ పానీయాలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. వేసవిలో కొవ్వును కరిగించుకోవాలనుకుంటే రోజుకు 2-3 సార్లు త్రాగండి. దీనితో పాటు, పుదీనా, అల్లం, నిమ్మకాయతో కూడిన టీ కూడా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
కొవ్వును తగ్గించుకోవడానికి తక్కువ మొత్తంలో రోజుకు మూడు సార్లు భోజనం తినడం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. దీనితో పాటు ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవాలి. ఇవి జీవక్రియను వేగవంతం చేస్తాయి. అంతేకాదు ఎక్కువగా తినాలనే కోరిక కలగదు. వేసవిలో ఎక్కువగా వేయించిన ఆహార పదార్ధాలు మాత్రమే కాదు.. ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఆహారాన్ని తినవద్దు. ఎందుకంటే ఈ అలవాట్లు శరీరంలో అదనపు కేలరీలు చేరేలా చేస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని జీవనశైలి వార్తలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి