- Telugu News Lifestyle Sugarcane Vs Juice: Which is Healthier, Surprising Benefits for Digestion and Immunity
Sugarcane Vs Juice: చెరకు Vs రసం.. ఆరోగ్యానికి ఏది బెటర్.. ఈ ఒక్క విషయం తెలిస్తే..
చెరకు.. దీనిని కేవలం తీపి కోసం మాత్రమే కాదు.. హిందూ పండుగలలో దేవుడికి నైవేద్యంగానూ ఉపయోగిస్తారు. రుచిలో తియ్యగా ఉండి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందించే ఈ చెరకు.. తక్షణ శక్తిని ఇవ్వడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. చెరకును డైరెక్ట్‌గా తినడం మంచిదా..? లేక రసం తాగితే మంచిదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 02, 2025 | 5:54 PM

తక్షణ శక్తికి చెరకు రసం: చెరకు, దాని రసం రెండూ శరీరానికి త్వరగా శక్తిని అందించేవే.. చెరకును నమిలినప్పుడు, శరీరానికి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలవుతుంది. ఇది దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది. చెరకు రసం తాగడం ద్వారా గ్లూకోజ్ వెంటనే రక్తంలో కలిసి తక్షణ శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా అలసటగా ఉన్నప్పుడు లేదా వ్యాయామం తర్వాత చెరకు రసం తాగడం చాలా ఉపయోగకరం.

జీర్ణక్రియకు ఫైబర్ బలం: జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో చెరకు ముఖ్యపాత్ర పోషిస్తుంది. చెరకును నమిలేటప్పుడు అందులోని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దీని ద్వారా జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఇతర కడుపు సమస్యలు తగ్గుతాయి. చెరకు రసం కూడా జీర్ణక్రియకు మేలు చేస్తుంది. కానీ నమలడంతో పోలిస్తే రసంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల దాని ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది.

దంతాలు, చిగుళ్లకు బలం: ఆశ్చర్యకరంగా.. చెరకు నమలడం వల్ల దంతాలు శుభ్రపడతాయి. చిగుళ్ళు కూడా బలంగా తయారవుతాయి. ఇందులో ఎముకలను బలోపేతం చేసే కాల్షియం, పాస్పరస్ వంటి ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. చెరకు నమలడం దంత ఆరోగ్యానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది.

ఇమ్యూనిటీ - డీటాక్స్: చెరకు, చెరకు రసం రెండూ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరం బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు శక్తినిస్తాయి. చెరకు రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు కాలేయాన్ని శుభ్రపరచడానికి సహాయపడతాయి. తక్షణ డీటాక్స్ ఫలితాల కోసం రసం తాగడం మంచిది.

నమలాలా..? తాగాలా..?: చెరకును నమలడం, రసం తాగడం రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు మీ శక్తిని క్రమంగా పెంచుకోవాలని, కడుపు సమస్యల నుంచి రిలీఫ్, దంతాలు, చిగుళ్లను పటిష్టం చేసుకోవాలని అనుకుంటే చెరకును నమిలి తినడం ఉత్తమం. మీకు తక్షణ శక్తి కావాలన్నా, శరీరం డీటాక్స్ జరగాలన్నా లేదా వేసవిలో వెంటనే చల్లదనం కావాలన్నా చెరకు రసం తాగడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.




