AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: వ్యవసాయం దండగ కాదు పండగ అంటున్న రైతు.. 23 అడుగుల పొడవు చెరకు పండించి రికార్డ్..

Success Story: వ్యవసాయంలో కొన్ని మెళకువలు, ఆధునిక పద్దతులను అవలంబిస్తే.. దండగ కాదు.. పండగగా మార్చుకోవచ్చు అంటున్నారు కొంతమంది రైతులు. తాజాగా ఓ రైతు టచ్ పద్దతిలో 23 అడుగుల కంటే..

Success Story: వ్యవసాయం దండగ కాదు పండగ అంటున్న రైతు.. 23 అడుగుల పొడవు చెరకు పండించి రికార్డ్..
Up Farmer Sucess Story
Surya Kala
|

Updated on: Apr 28, 2022 | 4:01 PM

Share

Success Story: వ్యవసాయంలో కొన్ని మెళకువలు, ఆధునిక పద్దతులను అవలంబిస్తే.. దండగ కాదు.. పండగగా మార్చుకోవచ్చు అంటున్నారు కొంతమంది రైతులు. తాజాగా ఓ రైతు టచ్ పద్దతిలో 23 అడుగుల కంటే ఎక్కువ పొడవైన చెరకును  ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో ఈ రైతు పంట ఆ రాష్ట్రంలోని రైతుల దృష్టిని ఆకర్షించింది.  ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మొరాదాబాద్ జిల్లాను(Moradabad District) రాష్ట్రవ్యాప్తంగా చెరకు బెల్ట్ అని కూడా పిలుస్తారు.ఇక్కడ చాలా మంది రైతులు చెరకు సాగు చేస్తారు . తాజాగా జిల్లాలో బిలారి ప్రాంతంలో నివసిస్తున్న ఒక రైతు టచ్  పద్ధతిలో 23 అడుగుల కంటే ఎక్కువ పొడవైన చెరకును పండించాడు. దీంతో ఈ రైతు పంట జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ చెరకును చూసేందుకు మొరాదాబాద్ మండల రైతులు రైతు మహ్మద్ ముబీన్ పొలానికి చేరుకుంటున్నారు. అదే సమయంలో,  చెరకు ఎలా పండించాలో అర్థం చేసుకున్న మహ్మద్ ముబీన్ ఈ పద్ధతిని ఇతర రైతులకు నిరంతరం తెలియజేస్తున్నాడు. తద్వారా రైతులు కూడా మెరుగైన పంటను పండించి లబ్ధి పొందవచ్చ అని మహ్మద్ ముబీన్ చెబుతున్నాడు. ఈ ప్రాంత నివాసులు 23 అడుగుల గోధుమలను కూడా పండిస్తారు.

చెరకు దిగుబడి రెండింతలు పెరిగింది

వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మొరాదాబాద్‌లోని రైతులు తోటి రైతులకు టచ్ పద్ధతి గురించి సమాచారాన్ని అందజేస్తున్నారు. ఇది చాలా మంది రైతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. వాస్తవానికి, బిలారి ప్రాంతం నివాసి మహ్మద్ మోబిన్..  ఏదైనా విభిన్నంగా చేయాలనే మక్కువతో టచ్ పద్ధతిలో చెరకు పంటను పండించడం ప్రారంభించాడు. అతని పొలంలో చెరకు 23 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకున్నప్పుడు అతని ప్రయత్నం  ఫలించింది. అంతేకాదు ఈ చెరకు గెడ బరువు కూడా మిగిలిన వాటికంటే రెండింతలు అధికం. సాధారణంగా ఒక బీగా పొలంలో 40-50 క్వింటాళ్ల చెరకు మాత్రమే లభ్యమయ్యే చోట, మహ్మద్ మోబిన్ యొక్క టచ్ పద్ధతిలో ఒక బీగా పొలంలో 100 క్వింటాళ్లకు పైగా పంట వచ్చింది. మొబిన్, TV9 భారతవర్ష్ తో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులు మంచి పంటలు పొందడానికి వారు అవలంబిస్తున్న పద్ధతులను మరింత మెరుగు పరచుకుని పంటలను సాగు చేయడం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడు రైతు వ్యవసాయంలో ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారని చెప్పాడు. .

స్పర్శ పద్ధతిలో సాగు : రైతు మహ్మద్ మోబిన్ మాట్లాడుతూ ఇంతకుముందు పంట సాగుచేసినప్పుడు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, నిరంతర శ్రమతో రైతు తన పొలంలో 23 అడుగుల చెరకును సాగుచేశానని చెప్పాడు. దీంతో రైతుకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సాధారణ వ్యవసాయం చేస్తే ఇంతకు ముందు రైతుకు బీగా పొలంలో 40 నుంచి 45 క్వింటాళ్ల చెరకు లభించేదని.. అయితే ఇప్పుడు టచ్ పద్ధతిలో పండించిన చెరకు కారణంగా ఒక్క బిగాలో 100 క్వింటాళ్ల చెరకు ఉత్పత్తి అవుతుందన్నారు. దీంతో రైతుల ఆనందానికి తావు లేకుండా పోయిందని, ఇతర రైతులు కూడా ఈ పద్ధతిలో చెరకు సాగు చేయాలని మోబిన్‌ తెలియజేస్తున్నారు.

Also Read: Kid Video Viral: తన పిల్లాడిని స్కూల్‌కి తీసుకుని వెళ్ళడానికి తల్లి తపన.. స్టూడెంట్స్ సాయం.. బాల్యాన్ని గుర్తు చేస్తోందంటున్న నెటిజన్లు

Butterfly Pose: ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పురుషులకు సీతాకోకచిలుక భంగిమ బెస్ట్ రెమిడీ (Photo Gellary)

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై