Mental Health: మీరు డిప్రెషన్‌లో ఉన్నారో? లేదో? ఇలా తెలుసుకోండి.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?

నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా యువత మానసిక ఒత్తిడితో చిత్తవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతున్నారు. దీంతో వారికి తెలియకుండానే ఒత్తిడి వారిని ముంచెత్తుతుంది. సగానికి పైగా వ్యాధులకు ఇదే ప్రధాన కారణం. ఏ వ్యాధి అయినా ఒత్తిడితోనే మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అటువంటి తీవ్రమైన వ్యాధిలో మధుమేహం కూడా..

Mental Health: మీరు డిప్రెషన్‌లో ఉన్నారో? లేదో? ఇలా తెలుసుకోండి.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?
Stress Management
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 26, 2024 | 9:32 PM

నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా యువత మానసిక ఒత్తిడితో చిత్తవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతున్నారు. దీంతో వారికి తెలియకుండానే ఒత్తిడి వారిని ముంచెత్తుతుంది. సగానికి పైగా వ్యాధులకు ఇదే ప్రధాన కారణం. ఏ వ్యాధి అయినా ఒత్తిడితోనే మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అటువంటి తీవ్రమైన వ్యాధిలో మధుమేహం కూడా ఒకటి. మన దేశంలో చాలా మంది ఇప్పటికే డయాబెటిస్‌తో పోరాడుతున్నారు. ఒత్తిడికి, మధుమేహానికి మధ్య సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడికి గురైనప్పుడు, శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఈ హార్మోన్ స్రావం కారణంగా, శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీంతో మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. ఒత్తిడికి గురైనప్పుడల్లా, కార్టిసాల్, కాటెకోలమైన్‌లు, థైరాయిడ్‌తో సహా శరీరంలోని అన్ని ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు మారడం ప్రారంభిస్తాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత అనేక వ్యాధులకు దారితీస్తుంది. ఇది మధుమేహానికి కూడా వర్తిస్తుంది.

కొత్త వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం మాత్రమే కాదు, ఇది శరీరంలో పాత వ్యాధులను కూడా ప్రేరేపిస్తుంది. ఆ వ్యాధులను నయం చేయడం చాలా కష్టం. ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఒత్తిడిని సక్రమంగా నిర్వహించడం చాలా అవసరం.

ఒత్తిడి లక్షణాలు

కొన్నిసార్లు మీరు ఒత్తిడికి లోనవుతున్నారనే విషయం మీరు కూడా గ్రహించలేరు. ఒత్తిడిని తగ్గించడానికి దాని లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఒత్తిడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి
  • తలనొప్పి
  • కండరాల నొప్పి లేదా ఒత్తిడి
  • ఎక్కువ లేదా చాలా తక్కువ నిద్ర
  • అన్ని వేళలా అనారోగ్యంతో బాధ పడటం
  • అలసట
  • ఎక్కువ లేదా తక్కువ ఆకలిగా ఉండటం

ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ ప్రవర్తనలో ఈ కింది మార్పులు కనిపిస్తాయి

  • ఎప్పుడూ చిరాకుగానూ, కోపంగానూ ఉంటుంది
  • నిత్యం డిప్రెషన్‌తో బాధపడుతుంటారు
  • ఏదో ఒక విషయం గురించి ఆలోచించడం
  • స్నేహితులు, కుటుంబ సభ్యులకు గుడ్‌బై
  • ఎక్కువ లేదా తక్కువగా తినడం
  • చాలా కోపంగా ఉండటం
  • అధికంగా మద్యపానం లేదా ధూమపానం

ఒత్తిడిని ఎలా నివారించాలి?

ఏదైనా వ్యాధిని నయం చేయడానికి, దాని మూలకారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి సాధారణంగా చాలా వ్యాధులకు మూల కారణం. దీన్ని నియంత్రించడం చాలా ముఖ్యం.

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
  • యోగా లేదా ధ్యానం చేయడం
  • మీ ప్రియమైన వారితో మాట్లాడటం
  • కెఫిన్ తీసుకోవడం తగ్గించడం
  • మీకు ఇష్టమైన సంగీతాన్ని వినడం
  • మంచి పుస్తకాలు చదవడం

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.