ఈ 3 అలవాట్లు వెంటనే మానేయకుంటే.. మీకు కడుపు క్యాన్సర్ పక్కా! వైద్యుల హెచ్చరిక..
ఇప్పటికే చిన్న వయసులోనే ఎందరో యువత తీవ్రమైన కడుపు రుగ్మతలతో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ ప్రారంభ దశలోనూ ఉన్నారు. గత నెలలో 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కడుపు క్యాన్సర్‌ను నిర్ధారించే బయాప్సీ ఫలితాలతో వచ్చాడని హైదరాబాద్‌లోని అపోలో క్యాన్సర్ సెంటర్ మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్..

నేటి జీవన శైలి కారణంలో మన దేశంలో ఆహార సంస్కృతి పూర్తిగా మారిపోయింది. బోల్డ్ ఫ్లేవర్లు, లేట్ నైట్ భోజనం, డిన్నర్ తర్వాత ఫోన్‌లో స్క్రోల్ వంటి ఆరోగ్యాన్ని అటక ఎక్కించే అలవాట్లు అందరికీ వంటపడుతున్నాయి. కానీ ఈ అలవాట్లు మీ పాలిట సైలెంట్ క్లిల్లర్స్ అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చిన్న వయసులోనే ఎందరో యువత తీవ్రమైన కడుపు రుగ్మతలతో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ ప్రారంభ దశలోనూ ఉన్నారు. గత నెలలో 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కడుపు క్యాన్సర్‌ను నిర్ధారించే బయాప్సీ ఫలితాలతో వచ్చాడని హైదరాబాద్‌లోని అపోలో క్యాన్సర్ సెంటర్ మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సురేష్ ఘద్యల్పాటిల్ చెప్పారు. అయితే సదరు యువకుడికి ఎలాంటి కుటుంబ చరిత్ర లేదు. ధూమపానం, మద్యం అలవాట్లు కూడా లేవు. అయినా ప్రాణాంతక క్యాన్సర్‌ను సూచించే లక్షణాలు కనిపిస్తున్నట్లు వివరించాడు.
ఆరోగ్యాన్ని గుళ్ల చేసే రుచులు నాలుక ఎందుకు కోరుతుంది?
మన దేశంలోని ప్రజలు వంటకాల్లో మసాలా దినుసులను ఉపయోగిస్తారు. మిరపకాయలలోని బయోయాక్టివ్ సమ్మేళనం అయిన క్యాప్సైసిన్ తక్కువ మోతాదులో శోథ నిరోధక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కానీ దీన్ని ఎక్కువగా, లేదా తరచుగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిటిస్, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. క్యాప్సైసిన్ మన మెదడు సహజ నొప్పి నివారణ మందులు అయిన ఎండార్ఫిన్‌లను విడుదల చేయడాన్ని ప్రేరేపిస్తుంది. ఒత్తిడితో కూడిన సందర్బాల్లో స్పైసీ ఆహారం వారికి ఉపశమనంగా సహకరిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే వీరు తీసుకునే అదనపు స్పైసీ ప్లేట్ కేవలం రుచి మాత్రమే కాదు.. మారువేషంలో ఉన్న ఒత్తిడి ఉపశమనం.
వేళాపాళాలేని భోజనం
నేటి వర్క్ కల్చర్ ఆకలికి, షెడ్యూల్ కు మధ్య తీవ్ర అసమతుల్యతను సృష్టిస్తోంది. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల GERD 2.7 రెట్లు పెరుగుతుంది. అదే నిద్రకు మూడు గంటలలోపు తినడం వల్ల 7.45 రెట్లు పెరుగుతుంది. రోజంతా భోజనం మానేసి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోన్ స్క్రోల్ చేస్తూ అతిగా తినేస్తుంటారు. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఆహారం జీర్ణక్రియపై ప్రభావం చూపడమే కాదు.. సిర్కాడియన్ జీవశాస్త్రంలో స్క్రీన్లు జోక్యం చేసుకోవడం, పేగు చలనశీలతను మందగించడం, యాసిడ్ ఎక్స్‌పోజర్‌ను పెంచడం వంటివి కూడా జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. ఇది కేవలం అసౌకర్యం మాత్రమే కాదు. చికిత్స చేయకపోతే GERD బారెట్ అన్నవాహికకు దారితీస్తుంది. ఇది ప్రాణాంతక స్థితికి చేరి చివరికి క్యాన్సర్‌గా మారే అవకాశం లేకపోలేదు.
స్ట్రెస్
ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడు ప్రిఫ్రంటల్ కార్టెక్స్‌ను అధిగమిస్తుంది. స్పృహలో కాకుండా స్వయంచాలకంగా ఎక్కువ మొత్తంలో తినేలా చేస్తుందని డాక్టర్ ఘద్యాల్పాటిల్ చెప్పారు. ఈ అలవాటు అల్ట్రా-ప్రాసెస్డ్, అధిక ఉప్పు, అధిక చక్కెర ఆహారాల వైపు నెట్టివేస్తుంది. ఇది దీర్ఘకాలిక పరిణామాలకు దారి తీస్తుంది. ఇలా తమకు తెలియకుండానే అధికంగా తినడం వల్ల కడుపు క్యాన్సర్‌కు జీవసంబంధమైన పునాది ఒంట్లో ఏర్పడుతుంది. మన దేశంలో కడుపు క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో ఒకటి H. పైలోరీ అనే బాక్టీరియం. ఇది దీర్ఘకాలిక కడుపు వాపుకు దారితీస్తుంది. అయితే దీనిని సులభంగా గుర్తించి, చికిత్స చేయవచ్చు. నిరంతర కడుపు సమస్యలు ఉన్న ఎవరైనా OTC యాంటాసిడ్లపై ఆధారపడటానికి బదులుగా ముందుగానే సరైన పరీక్షలు చేయించుకోవాలి.
కడుపు క్యాన్సర్ రాకూడదంటే.. మీ అలవాట్లు ఇలా ఉండాల్సిందే
- వేళకు భోజనం చేయాలి.
- నిద్రవేళకు కనీసం 3 గంటల ముందు రాత్రి భోజనం ముగించాలి.
- ఉప్పు, మసాలాలు మితంగా తీసుకోవాలి.
- సాయంత్రం వేళల్లో ఫోన్ స్క్రీన్‌లను పరిమితంగా చూడాలి.
- వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలి.
మీకు తరచూ గుండెల్లో మంట, కడుపు నొప్పి, వేగంగా బరువు తగ్గడం, మింగడంలో ఇబ్బంది, వాంతులు, రక్తంతో కూడిన వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని కలవండి. అలాగే స్పైస్ శత్రువు కాదు. ఒత్తిడిని ఎల్లప్పుడూ నివారించలేము. ఫోన్ వాడకం వెంటనే మానేయలేం. కానీ ఈ మూడు నిశ్శబ్దంగా జీర్ణవ్యవస్థను మార్చి, కాలక్రమేణా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే జీవ తుఫానును సృష్టిస్తాయని డాక్టర్ ఘద్యాల్పాటిల్ హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








