AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone Overheating: మండుతున్న ఎండలకు మీ స్మార్ట్‌ఫోన్ హీటెక్కుతోందా? పేలిపోకుండా కాపాడుకునే 8 సింపుల్ టిప్స్ ఇవే!

వేసవి కాలంలో ఎండ తీవ్రత మనుషులకే కాదు.. మనం నిరంతరం వాడే స్మార్ట్‌ఫోన్లకు కూడా చుక్కలు చూపిస్తుంది. బయట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండటంతో.. చాలా మంది ఫోన్లు కాసేపు వాడినా లేదా ఛార్జింగ్ పెట్టినా నిప్పులా కాలిపోతుంటాయి. స్మార్ట్‌ఫోన్ విపరీతంగా వేడెక్కడం వల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతినడమే కాకుండా.. కొన్నిసార్లు ఫోన్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

Smartphone Overheating: మండుతున్న ఎండలకు మీ స్మార్ట్‌ఫోన్ హీటెక్కుతోందా? పేలిపోకుండా కాపాడుకునే 8 సింపుల్ టిప్స్ ఇవే!
Smartphone Overheating In Summer
Bhavani
|

Updated on: May 22, 2026 | 7:10 PM

Share

ఎండకాలంలో మొబైల్ హీటింగ్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఫోన్ మదర్‌బోర్డ్ లేదా బ్యాటరీ శాశ్వతంగా పాడైపోయే అవకాశం ఉంది. అందుకే టెక్ నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. మరి ఈ కండీషన్ నుంచి మీ ఫోన్‌ను కాపాడుకుని, దాన్ని ఎల్లప్పుడూ కూల్‌గా ఉంచుకోవడానికి పాటించాల్సిన ఆ 8 సూపర్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. నేరుగా ఎండ తగలకుండా చూడండి మీ ఫోన్‌ను ఎప్పుడూ కూడా నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాలలో (ఉదాహరణకు కారు డాష్‌బోర్డ్, కిటికీల దగ్గర) ఉంచకూడదు. ఎండ నేరుగా తగలడం వల్ల ఫోన్ బాడీ చాలా వేగంగా హీటెక్కుతుంది.

2. ఛార్జింగ్ పెట్టేటప్పుడు కవర్ తీసేయండి: చాలా మంది ఫోన్లకు థిక్ పౌచ్‌లు లేదా డిజైనర్ కవర్లు వాడుతుంటారు. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ నుంచి సహజంగానే కొంత వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో బ్యాక్ కవర్ ఉంటే వేడి బయటకు పోదు. కాబట్టి ఛార్జింగ్ సమయంలో కవర్ తీసి ఉంచడం మంచిది.

3. ఒరిజినల్ ఛార్జర్లనే వాడండి: మార్కెట్లో దొరికే లోకల్ లేదా డూప్లికేట్ ఛార్జర్లు, కేబుల్స్ వాడటం వల్ల ఫోన్ విపరీతంగా వేడెక్కుతుంది. ఎల్లప్పుడూ మీ మొబైల్ బ్రాండ్‌కు సంబంధించిన ఒరిజినల్ ఛార్జర్‌ను మాత్రమే ఉపయోగించండి.

4. బ్రైట్‌నెస్ తగ్గించండి: ఎండలో స్క్రీన్ స్పష్టంగా కనిపించాలని చాలా మంది బ్రైట్‌నెస్‌ను 100% పెడుతుంటారు. దీనివల్ల డిస్‌ప్లే ప్యానెల్ పై ఒత్తిడి పడి ఫోన్ వేడెక్కుతుంది. సాధ్యమైనంత వరకు ‘ఆటో-బ్రైట్‌నెస్’ ఆప్షన్‌ను ఆన్ చేసి ఉంచండి.

5. బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను క్లోజ్ చేయండి: మనం వాడేసి వదిలేసిన యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. ఇవి ప్రాసెసర్‌పై లోడ్ పెంచుతాయి. కాబట్టి తరచూ బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను క్లియర్ చేస్తూ ఉండాలి.

6. అవసరం లేనప్పుడు జీపీఎస్, బ్లూటూత్ ఆఫ్ చేయండి: వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లు ఆన్ లో ఉన్నప్పుడు అవి నిరంతరం సిగ్నల్స్ కోసం వెతుకుతుంటాయి. ఇది బ్యాటరీని వేడి చేస్తుంది. అవసరం లేనప్పుడు వీటిని ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి.

7. గేమింగ్, కెమెరా వాడకం తగ్గించండి: ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రయాణాలలో ఉన్నప్పుడు ఫోన్ లో భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడటం, లాంగ్ టైమ్ వీడియో రికార్డింగ్ చేయడం వంటివి చేయవద్దు. ఇవి ప్రాసెసర్‌ను క్షణాల్లో వేడెక్కిస్తాయి.

8. వేడెక్కినప్పుడు ఏం చేయాలి? ఒకవేళ మీ ఫోన్ చాలా ఎక్కువగా వేడెక్కినట్లు అనిపిస్తే, వెంటనే దాన్ని కాసేపు ‘ఫ్లైట్ మోడ్’ లో పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి. అంతే తప్ప ఫోన్‌ను చల్లబరచడానికి ఫ్రిజ్‌లో పెట్టడం వంటి పిచ్చి పనులు అస్సలు చేయవద్దు.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ ఎండకాలంలోనూ ఎంతో కూల్‌గా, సేఫ్‌గా పనిచేస్తుంది.

గమనిక : ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న వివరాలు సాంకేతిక నిపుణుల సూచనలు మరియు సాధారణ గృహోపకరణ చిట్కాల ప్రాతిపదికన అందించబడ్డాయి. దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు.

Follow Us
సమ్మర్‌లో మీ మొబైల్ నిప్పులా కాలుతోందా?.. ఇలా చల్లబరచండి!
సమ్మర్‌లో మీ మొబైల్ నిప్పులా కాలుతోందా?.. ఇలా చల్లబరచండి!
వందలు, వేలు కాదు లక్షలే.. బాబోయ్ కేజీ మామిడి పండ్ల ధర తెలిస్తే..
వందలు, వేలు కాదు లక్షలే.. బాబోయ్ కేజీ మామిడి పండ్ల ధర తెలిస్తే..
SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. టార్గెట్ టాప్ 2
SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. టార్గెట్ టాప్ 2
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఈ వాహన సేవల మహిమ తెలుసా..?
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఈ వాహన సేవల మహిమ తెలుసా..?
కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. విలాసవంతమైన ఫీచర్స్‌తో 500 కి.మీ రేంజ్‌
కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. విలాసవంతమైన ఫీచర్స్‌తో 500 కి.మీ రేంజ్‌
మనిషి చంకలోని హీట్‌తో ఈ డిష్ తయారు చేస్తారని మీకు తెలుసా..?
మనిషి చంకలోని హీట్‌తో ఈ డిష్ తయారు చేస్తారని మీకు తెలుసా..?
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా క్రికెటర్.. ఎవరంటే?
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా క్రికెటర్.. ఎవరంటే?
కరోనాతో చనిపోయేవాడిని.. ఆ నటుడే కాపాడాడు: జబర్దస్త్ రాజమౌళి
కరోనాతో చనిపోయేవాడిని.. ఆ నటుడే కాపాడాడు: జబర్దస్త్ రాజమౌళి
ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే..
ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే..
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!