Sleep Divorce: యువతలో పెరిగిపోతున్న స్లీప్ డైవర్స్ కేసులు.. నిద్ర విడాకులు అంటే ఏమిటి? ఎందుకు తీసుకుంటున్నారంటే..
ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. అయితే మీ భాగస్వామి రాత్రంతా గురక పెడితే.. మీకు సరైన నిద్ర రాదు. అటువంటి పరిస్థితిలో ఎటువంటి కలతలు లేకుండా నిద్రపోవడానికి.. ప్రస్తుతం యువత స్లీప్ విడాకులను తీసుకుంటున్నారు. ఈ రోజు నిద్ర విడాకుల ధోరణి రోజు రోజుకీ పెరిగిపోతుంది. అది ఏమిటి? అది ఎలా పనిచేస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..

మనిషి ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు మంచి నిద్ర చాలా ముఖ్యం. అయితే మీ భాగస్వామి రాత్రంతా గురక పెడితే.. మీకు నిద్ర పట్టకుండా చేసే వివిధ పరిస్థితిలు ఉంటే సరిగ్గా నిద్రపోవడానికి చాలా కష్టపడతారు. నిద్ర సరిగ్గా పట్టకపోవడంతో ఉదయం లేచినప్పుడు చిరాకుగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో.. గత కొంత కాలంగా “నిద్ర విడాకులు” అనే ధోరణి వేగంగా పెరుగుతోంది. ఈ పద్దతి ముఖ్యంగా యువ జంటలు, పని చేస్తున్న వారిలో ప్రజాదరణ పొందుతోంది. ఈ రోజు నిద్ర విడాకులు అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? దీనిని పాటించే సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకుందాం..
నిద్ర విడాకులు అంటే ఏమిటి?
నిద్రలో విడాకులు అంటే మీరు మీ భాగస్వామితో విడిపోతున్నారని కాదు.. బదులుగా మీ ఇద్దరూ హ్యాపీగా నిద్రపోయెలా వేర్వేరు గదుల్లో లేదా వేర్వేరు పడకలపై పడుకోవడం. చాలా మంది జంటలు విడివిడిగా నిద్రపోవాలని నిర్ణయించుకుంటాయి. ఎందుకంటే వీరి నిద్ర అలవాట్లు డిఫరెంట్ గా ఉంటాయి. కొంతమంది గురక పెడతారు లేదా తరచుగా నిద్ర లేచే అలవాటు కలిగి ఉంటారు.
నిద్ర విడాకుల ధోరణి ఎందుకు పెరుగుతోంది?
గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ మంది తమ మానసిక ఆరోగ్యం,నిద్ర నాణ్యతపై ఎక్కువ శ్రద్ధ చూపడం ప్రారంభించారు. మంచి నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి నేరుగా సంబంధం కలిగి ఉంటుందని అనేక పరిశోధనలలో నిరూపించబడింది. నిద్ర తగినంతగా లేకపోతే సంబంధాలలో చిరాకు, విభేదాలు, ఉద్రిక్తత పెరుగుతాయి. అందుకే ఇప్పుడు చాలా మంది యువ జంటలు “నిద్ర విడాకులు” తీసుకుంటున్నారు. దీని వెనుక కారణాలు ఇవే కావచ్చు.
మంచి నిద్ర కోసం- ఒక భాగస్వామి నిద్రలో గురక పెడితే లేదా ఎక్కువగా కదిలితే, మరొక భాగస్వామి సరిగ్గా నిద్రపోలేరు. అటువంటి పరిస్థితిలో విడివిడిగా నిద్రపోవడం వల్ల ఇద్దరికీ మంచి నిద్ర వస్తుంది. నిరంతరాయంగా నిద్ర పోతారు.
సంబంధంలో ఒత్తిడిని తగ్గిస్తుంది- మంచి నిద్ర తర్వాత మానసిక స్థితి బాగుంటుంది. ఇది సంబంధంలో ప్రేమ , సానుకూల శక్తిని ఉంచుతుంది. ఇద్దరు భాగస్వాములు తాజాగా, రిలాక్స్‌గా ఉన్నప్పుడు, తగాదాలు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
వివిధ నిద్ర అలవాట్లు – చాలా సార్లు, జంటలు నిద్రపోయే సమయానికి, మేల్కొనే సమయానికి మధ్య చాలా తేడా ఉంటుంది. కొంతమందికి త్వరగా నిద్రపోయే అలవాటు ఉంటుంది. మరికొందరు ఫోన్ వాడటం లేదా రాత్రి కూడా పని చేసి ఆలస్యంగా నిద్రపోవడం చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో విడివిడిగా నిద్రపోవడం ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.
నిద్ర విడాకులు ఎలా పని చేస్తాయి?
నిద్ర విడాకులను అమలు చేయాలనుకునే జంటలు ఒకే గదిలో లేదా వేర్వేరు గదులలో లేదా వేర్వేరు పడకలపై పడుకోవాలని నిర్ణయించుకుంటారు. అది పూర్తిగా వారి సౌలభ్యం, సౌకర్యంపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది జంటలు ఇలా నిద్రపోవాలని కోరుకున్న తర్వాత.. మరింత శక్తివంతంగా, సంతోషంగా ఉన్నామని భావిస్తారు. ఇది వారి సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది.
ఏ విషయాలను గుర్తుంచుకోవాలంటే
నిద్ర విడాకులు తీసుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం, తద్వారా అది మీ సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపదు. అకస్మాత్తుగా మాట్లాడకుండా విడివిడిగా నిద్రపోవాలని నిర్ణయించుకోవడం వల్ల సంబంధంలో అపార్థం ఏర్పడుతుంది. రోజు పని తర్వాత కొంత సమయం ఇద్దరూ కలిసి గడపండి, తద్వారా సంబంధం అలాగే ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి మాత్రమే, కనుక భావోద్వేగ బంధాన్ని ప్రభావితం చేయకూడదు. కనుక ఈ స్లీప్ విడాకులు అనేది అవసరమైన జంటలు మాత్రమే పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)