Sleeping Tips: ప్రశాంతమైన నిద్రతో జీవన కాలం పెరుగుతుందా? సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు
ప్రశాంతమైన నిద్ర మానవుని జీవిత కాలం పెంపొందిస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మంచి నిద్ర అలవాట్లను పెంపొందించుకోవడం వల్ల పురుషుని జీవితం ఐదేళ్లు, స్త్రీ జీవితం రెండున్నరేళ్లు పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

ప్రశాంతమై నిద్రతో మానవుని ఆయుర్థాయం పెరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎలాంటి ఒత్తిళ్లు, ఆందోళన లేకుండా నిద్రపోవడం వల్ల జీవనానికి చాలా మేలు జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వీటిని నిజం చేస్తూ అమెరికాలోని అధ్యయనంలో తేలింది. ప్రశాంతమైన నిద్ర మానవుని జీవిత కాలం పెంపొందిస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మంచి నిద్ర అలవాట్లను పెంపొందించుకోవడం వల్ల పురుషుని జీవితం ఐదేళ్లు, స్త్రీ జీవితం రెండున్నరేళ్లు పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన వార్షిక సమావేశంలో ఈ అధ్యయన వివరాలను వెల్లడించింది. ఐదేళ్ల పాటు 1,72,000 మందికి పలు ప్రశ్నలు అడిగి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఐదు అంశాల్లో తీసుకున్న డేటాను అనుసరించి ఈ వివరాలను తెలిపారు. త్వరగా నిద్రపోవడం, నిద్రపోవడం, ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం, విశ్రాంతిగా మేల్కోవడం, నిద్ర మాత్రలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తి ఈ వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా నిద్రపోయే సమయంలో డీప్ స్లీప్ ఎన్ని గంటలు అనుభవిస్తున్నారో? దాన్నిబట్టే జీవన ప్రమాణం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
నిద్రపోయే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ప్రతిఒక్కరూ రాత్రి పూర్తిగా ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి. అర్ధరాత్రి నిద్ర లేవకపోవడం లేదా వారానికి రెండుసార్లు కంటే ఎక్కువ సార్లు నిద్రపోవడంలో ఇబ్బంది పడితే అంతరాయం లేకుండా నిద్ర పోయేందుకు ప్రయత్నించాలి. ఇలాంటి వారు ప్రశాంతంగా నిద్రపోవడానికి మెడిసిన్స్ వాడకుండా సహజంగానే పడుకోడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రశాంతమైన నిద్రను పొందాలంటే ముఖ్యంగా నిద్రపోయే సమయంలో నిద్ర రుగ్మతలను కూడా గుర్తించడం చాలా ముఖ్యం. అలాగే నిద్రను మెరుగుపర్చుకుంటే చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్రతో అకాల మరణాలను కూడా నిరోధించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఈ అలవాట్లు మెరుగుపర్చుకున్న వారు 30 శాతం మంది వరకూ అకాల మరణం నుంచి బయటపడ్డారు. అలాగే గుండె జబ్బులు ఉన్నవారు 21 శాతం, క్యాన్సర్‌తో బాధపడే వారు 19 శాతం మంది సరైన నిద్ర అలవాట్లతో మరణం నుంచి బయటపడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు సమస్యలు లేని వారు దాదాపు 40 శాతం మంది అకాల మరణం నుంచి బయటపడ్డారు. అయితే ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్ల వల్ల పురుషుల కంటే స్త్రీలు ఎందుకు తక్కువ లాభం పొందుతున్నారో? విషయంలపై పరిశోధనలు జరగాల్సి ఉంది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







