Health: నోరు తెరిచి నిద్రపోతున్నారా.. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా.. షాకింగ్ విషయాలు మీ కోసం..
మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. కానీ మారిపోతున్న లైఫ్ స్టైల్, పని వేళలు, ఒత్తిడి.. వంటి కారణాలతో నిద్ర అనేది అపురూపమైనదిగా మారిపోయింది. నిద్రపోయే వేళల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి..

మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. కానీ మారిపోతున్న లైఫ్ స్టైల్, పని వేళలు, ఒత్తిడి.. వంటి కారణాలతో నిద్ర అనేది అపురూపమైనదిగా మారిపోయింది. నిద్రపోయే వేళల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఫలితంగా నిద్ర లేమి సమస్యతో బాధపడుతుంటారు. అయితే కొందరు మాత్రం నిద్రపోతున్న సమయంలో నోరు తెరిచి నిద్రపోతుంటారు. ఇది ఇది స్లీప్ అప్నియాతో సంబంధం కలిగి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారికి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. నాసికా మార్గం క్లియర్ గా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. నోరు తెరిచి నిద్రపోవడానికి స్లీప్ అప్నియా చాలా సాధారణ కారణాలలో ఒకటి. అయితే ఈ వ్యాధితో సంబంధం లేకుండా నోరుతెరిచి నిద్రపోయే వారు కూడా ఉన్నారు. నోరు తెరిచి నిద్రపోయే వారికిక ముక్కు లోపల రక్త నాళాలు రక్తంతో నిండిపోతాయి. ఇది వాపు, సంకోచానికి కారణమవుతుంది. దీనివల్ల ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దీనివల్లే చాలా మంది శ్వాస తీసుకోవడానికి నోరు తెరుస్తారు.
అధిక ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు రాత్రిపూటే కాదు రోజంతా నోటి ద్వారే శ్వాస తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆందోళన చెందుతున్నప్పుడు అతను వేగంగా శ్వాస తీసుకుంటాడు. దీంతో బీపీ కూడా పెరుగుతుంది. నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి అలెర్జీలు కూడా మరొక కారణం. రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని రక్షించడానికి ఆ పదార్ధంపై దాడి చేసినప్పుడు అలెర్జీ వస్తుంది. దీంతో అలెర్జీ కారకాన్ని బయటకు పంపడానికి ప్రయత్నించే సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు.
ఊపిరితిత్తులలో మంట వల్ల ఉబ్బసం వస్తుంది. వీరికి తరచుగా శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి వీరికి చాలా సమయం పడుతుంది. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారి శరీరం నోటి ద్వారా శ్వాసించడానికి అలవాటుపడుతుంది. చలికారణంగా నాసికా రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో శరీరం ఆక్సిజన్ ను పొందడానికి నోటి ద్వారా శ్వాస తీసుకుంటుంటారు.




నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



