Beauty Tips: టెన్షన్ ఎందుకు దండగా చియా సీడ్స్ ఉండగా.. ఇలా చేస్తే వృద్ధాప్య ఛాయలు దూరం..

|

Nov 10, 2022 | 6:49 AM

చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తాయి.

Beauty Tips: టెన్షన్ ఎందుకు దండగా చియా సీడ్స్ ఉండగా.. ఇలా చేస్తే వృద్ధాప్య ఛాయలు దూరం..
Chia Seeds
Follow us on

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో పదార్థాలను తీసుకుంటున్నారు. అలాంటి వాటిల్లో చియా విత్తనాలు ఒకటి.. ఈ రోజుల్లో చియా సీడ్స్ బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వీటి వినియోగం కూడా బాగా పెరిగింది. చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తాయి. చియా విత్తనాలను తీసుకోవడం ద్వారా మన చర్మం ఆరోగ్యంగా మారడంతోపాటు కాంతివంతంగా మెరుస్తుంది. ఇంకా జుట్టును ధృఢంగా మార్చేందుకు కూడా చియా విత్తనాలను కూడా ఉపయోగిస్తారు. నేటి కాలంలో బరువు తగ్గించడం కోసం చియా సీడ్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

ఆరోగ్యకరమైన చర్మం కోసం చియా విత్తనాలు..

చియా సీడ్స్‌లో ఫోలేట్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఎ ఉండటం వల్ల చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చియా సీడ్స్ తినడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇంకా మరింత కాంతివంతంగా మృదువుగా కనిపిస్తుంది. ఈ గింజలు చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి మూలకంలా పని చేస్తాయి. దీని సహాయంతో చర్మం పొడిబారకుండా ఉండి.. దాని ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చర్మంపై దీన్ని ఉపయోగించడం ద్వారా వృద్ధాప్య సంకేతాలను తగ్గించవచ్చు. ముడతలు, ఫైన్ లైన్స్ వంటి వృద్ధాప్య సంకేతాలను తొలగించడానికి ఇది మంచి రెమెడీగా పరిగణిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ సమస్యను దూరం చేస్తాయి. ఇంకా దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేయడంలో కూడా సహాయపడతాయి. చియా గింజలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన UV కిరణాల నుంచి మన చర్మాన్ని రక్షించడానికి పని చేస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇలా ఉపయోగించండి..

వీటిని ఉపయోగించడానికి చియా గింజలను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టండి. దీంతో ఈ విత్తనాల రూపం మారుతుంది. ఇప్పుడు వాటిని మెత్తగా రుబ్బి.. గుజ్జులా తయారు చేయండి. దీని తరువాత అందులో తేనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయండి. ఈ ప్యాక్‌ను చర్మంపై అప్లై చేయండి. వేళ్లతో తేలికపాటి మసాజ్ చేస్తూ ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్‌ను అప్లై చేయడం ద్వారా మీ చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ఇలా వారానికి లేదా పదిరోజులకొకసారి ముఖంపై అప్లై చేయడం ద్వారా మొహం గ్లో పెరగడంతోపాటు కాంతివంతంగా మెరుస్తుంది.

నోట్‌: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..