Lemon Side Effects: ముఖంపై నిమ్మకాయను అతిగా రుద్దుతున్నారా? భయంకరమైన నిజాలు మీకోసం..
నిమ్మకాయ ఆహారం రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చడం మొదలు.. మొటిమల నుండి కూడా ఉపశమనం కల్పిస్తుంది. నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
నిమ్మకాయ ఆహారం రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చడం మొదలు.. మొటిమల నుండి కూడా ఉపశమనం కల్పిస్తుంది. నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మన శరీరాన్ని అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
నిమ్మరసం చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మంపై ఉన్న చిన్న మచ్చలు, మొటిమలను తగ్గుతాయి. ఈ కారణంగానే చాలా మంది ముఖానికిక నిమ్మకాయను ఉపయోగిస్తారు. అయితే, నిమ్మరసాన్ని ఎక్కువగా అప్లై చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా? నిమ్మరసం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.
1. అలర్జీ..
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. మన ఆరోగ్యకరమైన చర్మం కొద్దిగా ఆమ్ల pH కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, ఈస్ట్‌లను చంపుతుంది. ఈ ప్రయోజనాల కోసం నిమ్మరసాన్ని అప్లై చేయవచ్చు. కానీ, దీన్ని ఎక్కువగా అప్లై చేయడం వల్ల చర్మంపై అలర్జీ, మంట వంటి సమస్యలు వస్తాయి.
2. ఆక్వా స్పాట్స్..
నిమ్మకాయ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. ఈ కారణంగా, మొటిమలపై నిమ్మరసం పూయడం వల్ల మొటిమలు పగిలి వాటి నుండి రక్తం రావడం ప్రారంభమవుతుంది. నిమ్మరసం రాసుకోవడం ద్వారా మొటిమలు, మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ముఖాన్ని నిమ్మరసానికి దూరంగా ఉంచాలి.
3. చర్మపు రంగులో మార్పు..
నిమ్మరసం యొక్క దుష్ప్రభావాలలో ఒకటి చర్మపు రంగులో మార్పు. డార్క్ కాంప్లెక్షన్ లేదా డార్క్ స్కిన్ టోన్ ఉన్నవారు నిమ్మరసాన్ని జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే ఇది అసమాన చర్మానికి దారి తీస్తుంది.
4. సన్బర్న్..
నిమ్మరసం చర్మం సున్నితత్వాన్ని పెంచుతుంది. అందుకే సూర్యరశ్మి వల్ల చర్మానికి ఎక్కువ నష్టం, వడదెబ్బ వంటి సమస్యలు వస్తాయి.
ఇలా చేస్తే బెటర్..
నిమ్మరసం నీళ్లలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. ఒక చెంచా అలోవెరా జెల్‌లో 5, 6 చుక్కల నిమ్మరసం కలిపి ముఖంపై తేలికగా మసాజ్ చేయడం మంచిది. దీనితో పాటు డ్రై స్కిన్ కోసం అలోవెరా జెల్‌లో అర టీస్పూన్ గ్లిజరిన్ మిక్స్ చేసి ముఖానికి టోనింగ్ క్రీమ్ లాగా రాసుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..