Saree Care Tips: పట్టు చీరలను ఎలా సంరక్షించాలి..? ఈ సింపుల్ చిట్కాలు మీకు తెలుసా..?
పట్టుచీరలను జాగ్రత్తగా సంరక్షించడం చాలా ముఖ్యం. చీరలు ఎక్కువ రోజులు బీరువాలో ఉంచినప్పుడు మడతలు దెబ్బతినకుండా తరచుగా మడత మార్పు చేయాలి. చీరల నుంచి మంచి వాసన కోసం ఫ్యాబ్రిక్ కండిషనర్, షాంపూ నీటిలో కలిపి స్ప్రే చేయండి. ఇస్త్రీ చేయడం ముందు చీరపై దుపట్టా ఉంచి ఇస్త్రీ చేస్తే చీరకు నష్టం కలగదు. చీరలను భద్రంగా ఉంచడానికి నేప్తలిన్ బాల్స్ ఉపయోగించండి.

పట్టుచీరలు ఎంతో విలువైనవి. సరిగ్గా సంరక్షించకపోతే అవి త్వరగా పాడవుతాయి. ఇవి ఎక్కువగా ప్రత్యేక సందర్భాల్లోనే ఉపయోగిస్తాము. కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉంచడం చాలా అవసరం. మీ పట్టుచీరలు ఎక్కువ కాలం సురక్షితంగా ఉంచడానికి కొన్ని సింపుల్ చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నెలకోసారి చీర మడత
పట్టుచీరలు ఎక్కువ రోజులు మడత పెట్టి బీరువాలో పెట్టినప్పుడు మడతలు ఉన్న ప్రదేశాలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతాయి. దీని వల్ల అక్కడి నూలు కదలిక తప్పిపోయి చీర కింద భాగం నశించిపోవచ్చు. దీన్ని నివారించాలంటే చీరలను తరచుగా వేరే విధంగా మడతపెట్టడం అలవాటు చేసుకోండి. ప్రతి నెలా ఒకసారి చీరను తీసి కొత్త మడత వేస్తే చీర మంచిగా ఉంటుంది.
చీరకు మంచి వాసన కోసం
కొన్ని నెలలు చీరలను బీరువాలో ఉంచిన తర్వాత వాటిలో నుంచి కొన్ని మందులకు ఇబ్బందికరమైన వాసన వస్తుంది. దీన్ని నివారించడానికి ఇంట్లోనే సులభంగా చేసే చిన్న చిట్కా. ఒక స్ప్రే బాటిల్ తీసుకొని కొద్దిగా ఫ్యాబ్రిక్ కండిషనర్ (ఉదా: కంఫర్ట్), షాంపూను తీసుకుని వాటిని నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని చీర మీద కొద్దిగా స్ప్రే చేయండి. ఇది చీరకు మంచి వాసన తెస్తుంది. అలాగే చీరను కొత్తగా ఉంచుతుంది.
ఇస్త్రీ సమయంలో జాగ్రత్తలు
ఇస్త్రీ చేయకముందు చీర మీద ఉన్న మడతలు సరిగా సూటిగా పెట్టుకోవాలి. అలాగే చీరకు తగిన తేమ లేదా పొడి స్థితిని చూసుకోవాలి. ఇది ఇస్త్రీను సులభతరం చేస్తుంది. అలాగే పట్టుచీరలపై నేరుగా ఇస్త్రీ చేయడం వల్ల చీర కాలిపోవడమో, పల్చపడిపోవడమో జరుగుతుంది. దీనికి మార్గం ఏంటి అంటే చీరపై ఒక తక్కువ బరువున్న దుపట్టా లేదా శాల్ ఉంచి దాని మీదే ఇస్త్రీ చేయండి. ఈ పద్ధతితో ఇస్త్రీ చేస్తే వేడి నేరుగా చీర మీద పడదు. ఫలితంగా చీరకు ఎలాంటి నష్టం ఉండదు. పైగా చీర మిగిలిన చక్కదనాన్ని కూడా కోల్పోదు.
చీరను భద్రపరచడం
పట్టుచీరలు ఎక్కువ రోజుల పాటు బీరువాలో ఉంచేటప్పుడు వాటి మధ్యలో నేప్తలిన్ బాల్స్ లేదా చీరల కోసం ప్రత్యేకంగా అందించే ఫ్యాబ్రిక్ ఫ్రెషనర్స్ ఉంచండి. ఇది చీరలను పురుగుల నుంచి కాపాడుతుంది.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ విలువైన పట్టుచీరలను కొత్తవాటిలా ఉంచడంతో పాటు వాటి జీవితాన్ని పొడిగించవచ్చు. అలాగే చీరల విషయంలో అవలంబించే సరైన అలవాట్లు మీకు సమయాన్ని, డబ్బును ఆదా చేస్తాయి. మిల మిల మెరుస్తున్న మీ చీరలు మీ అందాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
