Glowing Skin: ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసిన్ని చన్నీళ్లు మీ ముఖంపై చల్లారంటే.. జరిగేదిదే!

అమ్మాయిలు ముఖంపై మచ్చలు ఉండకూడదని రకరకాలు ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే అమ్మాయిలు తమ చర్మం పట్ల కొంచెం ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఇందుకోసం వారు ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్, పార్లర్ ట్రీట్‌మెంట్‌లను ఆశ్రయిస్తుంటారు. కానీ ముఖ సౌందర్యాన్ని పెంచడానికి అంతగా ఖర్చు చేయాల్సిన..

Glowing Skin: ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసిన్ని చన్నీళ్లు మీ ముఖంపై చల్లారంటే.. జరిగేదిదే!
Home Remedies For Glowing Skin

Updated on: Aug 25, 2025 | 2:20 PM

చర్మం తాజాగా, అందంగా మెరిసిపోవాలని కోరుకోని వారుందరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అమ్మాయిలు ముఖంపై మచ్చలు ఉండకూడదని రకరకాలు ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే అమ్మాయిలు తమ చర్మం పట్ల కొంచెం ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఇందుకోసం వారు ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్, పార్లర్ ట్రీట్‌మెంట్‌లను ఆశ్రయిస్తుంటారు. కానీ ముఖ సౌందర్యాన్ని పెంచడానికి అంతగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదంటున్నారు సౌందర్య నిపుణులు. ప్రతి ఉదయం నిద్ర లేచిన వెంటనే చేసే కొన్ని పనులు మీ చర్మాన్ని సహజంగానే మెరిపిస్తాయట. తద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. కాబట్టి ముఖం అందంగా మెరిసిపోవడానికి ఉదయం నిద్రలేచిన వెంటనే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ముఖ కాంతిని పెంచడానికి ఉదయాన్నే పాటించాల్సిన అలవాట్లు ఇవే..

చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం

ఉదయం నిద్రలేవగానే ముఖం అలసిపోయినట్లు కనిపిస్తుంది. కాబట్టి ముఖాన్ని రిఫ్రెష్ చేసుకోవడానికి చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. వాపును తగ్గిస్తుంది. ముఖం కడుక్కున్న తర్వాత తుడుచుకుని.. ముఖంపై తాజా కలబంద జెల్ రాసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ప్రత్యామ్నాయంగా, ముఖంపై రోజ్ వాటర్‌ను కూడా స్ప్రే చేయవచ్చు. ఇది చర్మంపై సహజ టోనర్‌గా పనిచేస్తుంది.

గోరువెచ్చని నీరు తాగాలి

మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగాలి. ఈ రెండు పదార్థాలు చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరచడానికి, శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడతాయి. నిమ్మకాయలోని విటమిన్ సి చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

తేలికపాటి వ్యాయామం చేయాలి

వ్యాయామం చర్మ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ముఖ్యం. ప్రతి ఉదయం 15 నిమిషాలు నడవడం, శరీర భాగాలను సాగదీయడం, సూర్య నమస్కారం చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. వ్యాయామం చేస్తే చెమట ద్వారా చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది.

ధ్యానం

ముఖ సౌందర్యం, ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఖరీదైన క్రీములే కాకుండా మానసిక ప్రశాంతత కూడా అవసరం. మనం ఒత్తిడికి గురై చర్మం కూడా ముడతలు పడుతుంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేయాలి. ఇది చర్మానికి, మనసుకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ధ్యానం మిమ్మల్ని సానుకూలంగా ఉంచుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

చర్మ కాంతిని పెంచడానికి, మీ శరీరాన్ని లోపలి నుండి పోషించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం, మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ఒక ఆపిల్, నాలుగు నుంచి ఐదు నానబెట్టిన బాదం, ఒక గ్లాసు నువ్వుల నీరు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. ఇది చర్మ కాంతిని పెంచడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.