Shoes Smell: మీ బూట్ల దుర్వాసన సింపుల్‌గా తొలగించే చిట్కాలు.. ఇలా చేస్తే చాలు నిమిషాల్లో అద్భుతం!
వేసవిలో పాదాలు విపరీతంగా చెమట పడుతుంటాయి. ఈ చెమట వల్ల బూట్లు, సాక్స్‌లకు అంటుకున్న బ్యాక్టీరియాతో కలిసిపోయి చెడు వాసన కలిగించే ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల దుర్వాసన వస్తుంది. దీంతో బూట్లు ఎంత బాగా ఉతికినా ఈ దుర్వాసన పోదు. అయితే ఈ కింది చిట్కాలను పాటిస్తే..

కొంతమంది వేసవి అయినా, వర్షాకాలం అయినా చెప్పులు లేదా బూట్లు లేకుండా బయటకు అడుగు పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. కానీ వేసవిలో పాదాలు విపరీతంగా చెమట పడుతుంటాయి. ఈ చెమట వల్ల బూట్లు, సాక్స్‌లకు అంటుకున్న బ్యాక్టీరియాతో కలిసిపోయి చెడు వాసన కలిగించే ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల దుర్వాసన వస్తుంది. దీంతో బూట్లు ఎంత బాగా ఉతికినా ఈ దుర్వాసన పోదు. అయితే ఈ కింది చిట్కాలను పాటిస్తే, మీ బూట్ల నుంచి వెలువడే దుర్వాసనను సులభంగా తొలగించవచ్చు. ఎలాంగంటే..
పండ్ల తొక్కలను వాడొచ్చు
మీ బూట్లు దుర్వాసన వస్తుంటే నారింజ, నిమ్మ తొక్కలను తీసుకొని రాత్రంతా మీ బూట్ల లోపల ఉంచండి. మీరు ఉదయం ఆ తొక్కలను తీసివేస్తే, మీ బూట్లు దుర్వాసన రాదు.
ఎండలో ఉంచాలి
బూట్ల నుండి దుర్వాసనను తొలగించడానికి సులభమైన మార్గం బూట్లను ఎండలో కాసేపు ఆరబెట్టడం. ఇది బూట్లలోని తేమను తగ్గిస్తుంది. బ్యాక్టీరియాను చంపుతుంది. ఇది షూ నుండి వచ్చే దుర్వాసనను క్రమంగా తొలగిస్తుంది. కాబట్టి మీ బూట్లు ధరించిన తర్వాత కొన్ని గంటల పాటు ఎండలో ఉంచడం అలవాటు చేసుకోండి.
వెనిగర్
వెనిగర్ బూట్ల నుండి దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. దీని కోసం, ఒక స్ప్రే బాటిల్‌లో కొంచెం తెల్ల వెనిగర్ తీసుకొని, దానిని కొంచెం నీటితో కలపండి. దీన్ని బూట్ల లోపల స్ప్రే చేయండి. ఈ తెల్ల వెనిగర్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది.
టీ బ్యాగులు
టీ బ్యాగుల్లోని టానిన్లు బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి. మీ బూట్ల లోపల టీ బ్యాగులను ఉంచితే.. కొన్ని నిమిషాల్లో మీ బూట్ల నుండి వచ్చే దుర్వాసనను తగ్గిస్తుంది.
బేకింగ్ సోడా
బూట్ల నుండి వచ్చే దుర్వాసనను తొలగించడంలో బేకింగ్ సోడా ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి షూ లోపల కొంచెం బేకింగ్ సోడా చల్లి రాత్రంతా అలాగే ఉంచండి. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది.
కర్పూరం
రాత్రిపూట మీ బూట్ల లోపల రెండు కర్పూర బిళ్ళలను వేసి వాటిని గాలి చొరబడకుండా ఉంచండి. ఇది షూ లోపల ఉన్న బ్యాక్టీరియాను చంపి, దుర్వాసనను తొలగిస్తుంది.
లావెండర్ ఆయిల్
షూ లోపల రెండు చుక్కల లావెండర్ ఆయిల్ వేయండి. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దుర్వాసనను తగ్గించి మంచి వాసన వచ్చేలా చేస్తాయి.
బిర్యానీ ఆకులు
బిర్యానీ ఆకులను ఆహారం రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఈ ఆకును రాత్రిపూట షూ లోపల ఉంచి ఉదయం తీసేస్తే షూ నుండి వచ్చే దుర్వాసనను సైతం తొలగిస్తాయి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.








