వేడి నీళ్లలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారా..? జాగ్రత్త మీకు మీరుగానే సమస్యని కోరి తెచ్చుకుంటున్నట్లే..
నిమ్మకాయ, తేనె కలిపిన గోరువెచ్చని నీటిని తాగడం అందరికీ ప్రయోజనకరంగా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో, అంతే దుష్ప్రభావాలు కూడా ఉంటాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికి నిమ్మకాయ, తేనె కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోవటం అలవాటుగా చేసుకుంటున్నారు. తేనె, నిమ్మకాయలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఎంజైమ్‌లు శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. కానీ ఈ పానీయం ప్రతి వ్యక్తికి ప్రయోజనకరంగా ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న.? నిమ్మకాయ, తేనె కలిపిన గోరువెచ్చని నీటిని తాగడం అందరికీ ప్రయోజనకరంగా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో, అంతే దుష్ప్రభావాలు కూడా ఉంటాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలిపినప్పుడు చేదు రుచి వచ్చే అవకాశం ఉంది. కడుపులో ఆమ్లత్వం పెరగడం వల్ల ఇది జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఆమ్లత్వం ఉన్నవారు నిమ్మకాయ, తేనె కలిపిన వేడి నీరు తాగటం వల్ల చేదు రుచి సమస్యను పెంచుతుంది. ఎందుకంటే నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది.
కడుపులో అల్సర్లు వస్తాయి. వేడి నీటిలో తేనె, నిమ్మకాయ కలిపి తాగడం వల్ల కడుపులో అల్సర్ సమస్య పెరుగుతుంది. నిమ్మకాయలోని ఆమ్లం అల్సర్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. తేనెకు వేడి ప్రభావం ఉంటుంది. ఇది ఈ సమస్యను కూడా పెంచుతుంది.
మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారు వేడి నీటిలో తేనె, నిమ్మకాయ కలిపి తాగకూడదు. అలా చేయడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య పెరుగుతుంది. ఎందుకంటే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో కాల్షియం ఆక్సలేట్ మొత్తాన్ని పెంచుతుంది.
వేడి నీటిలో నిమ్మకాయను తేనెతో కలిపి తాగడం వల్ల దంత సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్‌ను బలహీనపరుస్తుంది. ఇది దంతక్షయం, సున్నితత్వానికి దారితీస్తుంది. కాబట్టి మీకు ఈ సమస్యలు ఏవైనా ఉంటే, మీరు తేనెతో నిమ్మకాయ నీరు తాగకుండా ఉండాలి. వెంటనే వైద్యులను సంప్రదించటం ఉత్తమం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








