AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట స్నానం చేస్తే ఏమవుతుంది.. నిజంగా ఆ సమస్యలు వస్తాయా..?

రాత్రి స్నానం కేవలం శుభ్రతకు మాత్రమే కాదు.. శరీరం, మనస్సు అలసటను తగ్గించి ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది మంచి నిద్రకు సహాయపడి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అలసట, ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే కొన్ని సమస్యలు కూడా లేకపోలేదు. రాత్రిపూట స్నానం వల్ల ఎటువంటి ప్రయోజనాలు, నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రిపూట స్నానం చేస్తే ఏమవుతుంది.. నిజంగా ఆ సమస్యలు వస్తాయా..?
ఇందుకోసం ముందుగా ఒక టీస్పూన్ చక్కెరను షాంపూలో కలిపి మీ తలపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తరువాత జుట్టును మంచి నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి.
Krishna S
|

Updated on: Nov 27, 2025 | 1:26 PM

Share

స్నానం అనేది కేవలం శుభ్రత కోసం చేసే పని కాదు.. ఇది శరీరం, మనస్సు అలసటను దాదాపు సగం వరకు తొలగించి, ప్రశాంతంగా ఉంచే ఒక దినచర్య. చాలా మంది ఉదయం స్నానం చేసినా మరికొందరు రోజంతా పడిన శ్రమ, ఒత్తిడిని తొలగించుకోవడానికి రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తుంటారు. రాత్రిపూట స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, కొన్ని నష్టాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

రాత్రి స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు

రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, ముఖ్యంగా మెదడు, చర్మానికి ఇది ఒక వరంలా పనిచేస్తుంది. రాత్రి సరిగా నిద్ర పట్టని వారికి రాత్రి స్నానం అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. ఆ తర్వాత శరీరం చల్లబడే క్రమంలో మెదడు విశ్రాంతి సంకేతాన్ని అందుకుంటుంది. ఇది ఆలోచనలను తగ్గించి, శరీరాన్ని నిద్రకు సిద్ధం చేస్తుంది. అందుకే మంచి నిద్ర కోసం నిపుణులు రాత్రిపూట స్నానం చేయాలని సలహా ఇస్తారు.

బిజీగా గడిపిన తర్వాత శరీరం, మనస్సు అలసిపోతాయి. రాత్రి స్నానం అనేది ఒక రకమైన డీటాక్స్ థెరపీ లాగా పనిచేస్తుంది. నీటి చల్లదనం లేదా వెచ్చదనం కండరాలను సడలించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో మానసిక ఒత్తిడి తగ్గి, శరీరం ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా పేరుకుపోయిన కాలుష్యం, దుమ్ము, చెమట వల్ల రంధ్రాలు మూసుకుపోతే అలెర్జీలు, మొటిమలు వస్తాయి. రాత్రి స్నానం వల్ల ఇవన్నీ శుభ్రమై, చర్మం సహజంగా శుభ్రపడుతుంది. జుట్టులో పేరుకుపోయిన మురికి కూడా తొలగిపోయి, తల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

రాత్రి స్నానం వల్ల వచ్చే నష్టాలు

రాత్రి స్నానం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు అది అసౌకర్యానికి దారితీయవచ్చు. కొంతమందికి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల జలుబు, తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తల పూర్తిగా ఆరకపోతే ఈ సమస్య పెరుగుతుంది. ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యల లక్షణాలను కూడా పెంచుతుందని చెబుతారు.

రాత్రిపూట స్నానం మంచి అలవాటే అయినప్పటికీ దాని వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే జలుబు సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా తల బాగా ఆరిన తర్వాతే పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..