AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dinner Before Sunset: సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం.. జైనులు ఇప్పటికీ ఈ రూల్‌ ఎందుకు పాటిస్తారో తెల్సా? అసలు సీక్రెట్ ఇదే

చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తింటుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆలస్యంగా కంటే కాస్త ముందుగానే తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు సాధారణంగా జైన ఆహారం గురించి వినే ఉంటారు. జైనులు సూర్యాస్తమయానికి ముందే భోజనం చేస్తారు.

Dinner Before Sunset: సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం.. జైనులు ఇప్పటికీ ఈ రూల్‌ ఎందుకు పాటిస్తారో తెల్సా? అసలు సీక్రెట్ ఇదే
Dinner Before Sunset
Srilakshmi C
|

Updated on: May 05, 2025 | 9:13 PM

Share

మనం ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకునే ఆహారమే కాదు, దానిని తీసుకునే సమయం కూడా చాలా ముఖ్యం. చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తింటుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆలస్యంగా కంటే కాస్త ముందుగానే తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు సాధారణంగా జైన ఆహారం గురించి వినే ఉంటారు. జైనులు సూర్యాస్తమయానికి ముందే భోజనం చేస్తారు. ఆ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోరు. ఇలా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది చిన్న అభ్యాసంలా అనిపించినప్పటికీ, దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి సాయంత్రం పూట సూర్తస్తమయానికి ముందే భోజనం తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

సాయంత్రం తర్వాత మన శరీరంలో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ నెమ్మదిస్తుంది. అంటే జీవక్రియ చీకటి పడే కొద్దీ క్రమంగా నెమ్మదిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అది శరీరంలో కొవ్వుగా మారే ప్రమాదం ఉంది. దీనివల్ల బరువు పెరగడం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రి భోజనం త్వరగా తినడం వల్ల ఈ రకమైన సమస్యలు తగ్గుతాయి. శరీరం ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి ఈ రకమైన అభ్యాసం మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

మన శరీరానికి రాత్రిపూట విశ్రాంతి అవసరం. కాబట్టి భోజనం ఆలస్యం అయితే, శరీరం విశ్రాంతిపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతుంది. అదే సాయంత్రం త్వరగా భోజనం చేస్తే, అప్పుడు మీ శరీరం బాగా విశ్రాంతి తీసుకుంటుంది. ఇది నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. రాత్రిపూట నిద్రపోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో లెప్టిన్, గ్రెలిన్ అనే హార్మోన్లు ఉంటాయి. ఇవి ఆకలి, తృప్తిని నియంత్రిస్తుంది. కాబట్టి, భోజనం ఆలస్యం చేయడం వల్ల ఈ హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిద్రకు అవసరమైన మెలటోనిన్ అనే హార్మోన్ పనితీరు కూడా బలహీనపడుతుంది. దీని కారణంగా రాత్రి సరిగ్గా నిద్రపోలేరు. ఇది మరింత అలసిపోయేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మధుమేహ నివారణ

మీరు ఆలస్యంగా తినేవారైతే, మీ ఆహారంలో ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటే అవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అదే రాత్రి, మీరు కాస్త ముందుగా భోజనం చేస్తే, ఇన్సులిన్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. ఈ చర్య మధుమేహం వంటి సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, సాయంత్రం 7 గంటలకు ముందు తినే అలవాటు మీకు అనేక విధాలుగా సహాయపడుతుంది. ఇది అర్ధరాత్రి ఆకలి వేయకుండా, అవాంఛిత ఆహారాలు తినకుండా నిరోధిస్తుంది. కాబట్టి వీలైతే, జైనులు ఇప్పటికీ అనుసరిస్తున్న ఈ పద్ధతిని అవలంబించండి. ఆరోగ్యంగా ఉండండి.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు
న్యూ ఇయర్ వేళ ప్రజలపై మరో భారం.. పెరగనున్న ఆ ధరలు..!
న్యూ ఇయర్ వేళ ప్రజలపై మరో భారం.. పెరగనున్న ఆ ధరలు..!
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..