
ఫిబ్రవరి నెల మొదలు కాగానే వేసవి కాలాన్ని తలపిస్తోంది. ఉదయం, రాత్రి వాతావరణం చలిగా ఉన్నా.. ఉదయం 10 అయ్యిందంటే చాలు.. ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనం ఇప్పటినుంచే అల్లాడుతున్నారు. వేసవి కూడా మొదలు కాకముందే.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కానీ ఈ సమయంలోనే ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా వాతావరణ పరిస్థితులు మారినప్పుడల్లా.. పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. జ్వరం, జలుబు, దగ్గు, అలెర్జీ, చర్మ సమస్యలు, డీహైడ్రేషన్ వంటి చాలా పలు రకాల సమస్యలు ఎదురవుతాయి. కాలానుగుణంగా శీతా కాలం నుండి వేసవి కాలానికి మారే క్రమంలోనే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు దరి చేరకుండానే మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూడండి.
శీతా కాలం నుండి వేసవికి మారడం వల్ల చాలా మందిలో వచ్చే ఆరోగ్య సమస్యల్లో అలెర్జీ ఒకటి. గాలిలో పుప్పొడి స్థాయిలు పెరగడం వల్ల.. కొంత మంది వ్యక్తుల్లో అలెర్జీ పెరుగుదలకు కారణం అవుతుంది. తుమ్ములు, ముక్కు దిబ్బడ, కళ్ల దురదలు వంటి లక్షణాలు అలెర్జీకి కారణంగా చెప్పొచ్చు. కాబట్టి జాగ్రత్త వహించాలి.
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చెమట ఎక్కువగా పట్టడం వల్ల.. శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. దీని వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. నీరసం, కళ్లు తిరగడం, తల తిరగడం, చెమట ఎక్కువగా పట్టడం, నోరు బాగా ఎండిపోవడం, వాంతులు, విరేచనాలు వంటివి డీ హైడ్రేషన్‌కు కారణాలుగా చెప్పొచ్చు. డీహైడ్రేషన్‌కు గురైనవారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
వేసవి కాలంలో ఆరు బటయ సమయం గడపడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. వడదెబ్బలు, అనాక వృద్ధాప్యం, చర్మ కాన్సర్ వంటి సమస్యలు దారి తీయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మారుతున్న వాతావరణంలో వైరల్ కూడా వృద్ధి చెందుతుంది. అలాగే ఉష్ణోగ్రత లెవల్స్ కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఇలాంటి సమయంలో శ్వాస కోశ ఇన్ ఫెక్షన్లు కూడా రావచ్చు. కాబట్టి పరిశుభ్రత పాటించడం అవసరం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.