AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా చేస్తే ఎలుకలు మీ ఇంటి దరిదాపులకు కూడా రావు.. ఒకసారి ట్రై చేసి చూడండి

ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువైతే రోజువారీ జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా గోదాములు, వంటగదుల వంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. తినే పదార్థాలు నాశనం కావడంతోపాటు ఈ జంతువుల ద్వారా వ్యాపించే హానికరమైన సూక్ష్మజీవులు ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్ని సహజ మార్గాలు అమలు చేస్తే ఎలుకల బెడద నుండి ఉపశమనం పొందగలుగుతాం. ఇప్పుడు అలాంటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం.

ఇలా చేస్తే ఎలుకలు మీ ఇంటి దరిదాపులకు కూడా రావు.. ఒకసారి ట్రై చేసి చూడండి
Rat Control At Home
Prashanthi V
|

Updated on: May 10, 2025 | 3:22 PM

Share

ఉల్లిపాయల్లో ఉండే ఘాటైన వాసన ఎలుకలకు అసహనంగా మారుతాయి. వంటగదిలో లేదా ఎలుకలు తక్కువగా రావలసిన చోట ఉల్లిపాయ ముక్కలు లేదా తొక్కలు ఉంచడం వలన అవి దూరంగా ఉంటాయి. రోజూ ముక్కలను మార్చడం వల్ల మంచి ఫలితాలు చూడొచ్చు. ఇది సులభంగా చేయగల ఇంటి ప రిష్కారం.

లవంగాలు కూడా ఎలుకలకు భరించలేని వాసనను కలిగిస్తాయి. కొన్ని లవంగాలను ముడత బట్టలో చుట్టి లేదా దూదిలో పెట్టి ఎలుకలు ఎక్కువగా కనిపించే చోట ఉంచితే అవి అక్కడికి రావడం తగ్గుతుంది. అలాగే లవంగ నూనెను దూదిపై వేసి ఉంచినపుడు కూడా ఇదే విధంగా పని చేస్తుంది.

ఇంట్లో సులభంగా దొరికే బేకింగ్ సోడా సహాయంతో కూడా ఎలుకల దాడిని తగ్గించవచ్చు. ఎలుకలు వస్తున్న ప్రదేశాల్లో చిన్న మొత్తంలో బేకింగ్ సోడా చల్లడం వలన అవి అక్కడికి రావాలనే ఆసక్తి కోల్పోతాయి.

మిరియాలు గొప్ప వాసనతోపాటు ఘాటుగా ఉండే తత్వం కలిగి ఉంటాయి. మిరియాల పొడి ఎలుకలు కనిపించే మూలల్లో చల్లడం వలన అవి భయపడతాయి. ఇది ఇతర జంతువులకు హాని లేకుండా పని చేసే మార్గం.

కారం పొడి వాసన ఎలుకల శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనితో అవి ఆ ప్రదేశానికి రాలేవు. కారం పొడి ఎలుకల మార్గంలో చల్లడం వలన అవి ఆ దారి మార్చుకుంటాయి.

కర్పూర వాసన చాలా బలంగా ఉంటుంది. తులసి నూనెతో కలిపిన కర్పూరాన్ని ఒక దూదిలో వేసి ఎలుకలు వచ్చే ప్రదేశంలో ఉంచితే.. దాని వాసనతో అవి అక్కడికి రావడం మానేస్తాయి. దీనితోపాటు ఇంట్లో శుభ్రత వాతావరణం కూడా నెలకొంటుంది.

ఎలుకల బెడదను నివారించడంలో పిల్లులు సహాయకారులుగా నిలుస్తాయి. ఇంట్లో పిల్లి ఉనికి వలన ఎలుకలు దూరంగా ఉంటాయి. పిల్లి వాసనతోపాటు వాటి శబ్దాలు కూడా ఎలుకలను భయపెడతాయి. కావున ఇంట్లో పిల్లిని పెంచడం మంచి ప్రత్యామ్నాయంగా మారుతుంది.

ఈ ఇంటి చిట్కాలను పాటించడం వలన ఎలుకల బెడద తగ్గుతుంది. రసాయనాలు లేకుండా సురక్షితమైన ఈ పద్ధతులు కుటుంబం ఆరోగ్యాన్ని కాపాడతాయి. సహజ పదార్థాలతో ఇంటిని ఎలుకల నుండి కాపాడుకోవచ్చు.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు