AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bath: స్నానం నీటిలో చిటికెడు ఇది కలిపారంటే.. ఊహించలేనన్ని అద్భుతాలు మీ సొంతం!

కొంతమంది స్నానం చేయడానికి నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ లేదా పసుపు లేదా పచ్చి పాలు కలుపుతుంటారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయ. అదేవిధంగా చాలా మంది నీటిలో చిటికెడు ఉప్పు కలుపుకుని స్నానం చేస్తుంటారు. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి అనేక ఖనిజాలతో సమృద్ధిగా ఉండే..

Bath: స్నానం నీటిలో చిటికెడు ఇది కలిపారంటే.. ఊహించలేనన్ని అద్భుతాలు మీ సొంతం!
Salt Water Bath
Srilakshmi C
|

Updated on: May 02, 2025 | 7:41 PM

Share

స్నానం చేయడం మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం. కొంతమంది స్నానం చేయడానికి నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ లేదా పసుపు లేదా పచ్చి పాలు కలుపుతుంటారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయ. అదేవిధంగా చాలా మంది నీటిలో చిటికెడు ఉప్పు కలుపుకుని స్నానం చేస్తుంటారు. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి అనేక ఖనిజాలతో సమృద్ధిగా ఉండే ఉప్పు శరీరానికి కూడా మేలు చేస్తుంది. నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల పరిసరాల నుంచి ప్రతికూల శక్తి తొలగిపోవడమే కాకుండా, శరీరానికి అనేక ప్రయోజనాలు కూడా అందుతాయి. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

చర్మానికి మేలు

స్నానపు నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల చర్మం మురికి శుభ్రమవుతుంది. ఇది మృతకణాలను పూర్తిగా తొలగిస్తుంది. వేసవిలో చెమట వల్ల కలిగే రింగ్‌వార్మ్, దురద మొదలైన చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. అంతే కాకుండా ఉప్పులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం

పరిగెత్తేటప్పుడు, నడిచేటప్పుడు శరీరంలో ఎక్కడైనా నొప్పి అనిపిస్తే, గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి స్నానం చేయాలి. ఇది కీళ్ల నొప్పి, మోకాలి నొప్పి,వెన్నునొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల వాపు కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ఒత్తిడిని తగ్గిస్తుంది

ప్రతిరోజూ స్నానం నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది అలసటను దూరం చేసి శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తుంది.

శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది

ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. అదనంగా ఇది శరీరంలో మంట, దురద, వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

ప్రతికూల శక్తిని తొలగిస్తుంది..

ఉప్పులో శుభ్రపరిచే లక్షణాలు ఉన్నందున, స్నానపు నీటిలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేయడం వల్ల శరీరం నుంచి ప్రతికూల శక్తి, మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.

స్నానానికి ఉప్పునీరు ఎలా తయారు చేసుకోవాలంటే?

ముందుగా ఒక బకెట్ తీసుకొని దానిని నీటితో నింపాలి. ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. నీటిలో ఉప్పు కలిసిన తర్వాత స్నానం చేయాలి. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల చర్మానికి మేలు జరగడమే కాకుండా ప్రతికూల శక్తిని తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.