Curd for Dandruff: కేవలం రూ.10 ఖర్చుతో ఇలా 4 రోజులు చేస్తే చాలు.. చుండ్రు సమస్య ఫసక్..

|

Feb 08, 2023 | 2:08 PM

చుండ్రు కారణంగా తలలో దురద, మంట వంటి పలు సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కొందరిలో జుట్టు బలహీనంగా కూడా మారుతుంది. ఫలితంగా జుట్టు రాలడం..

Curd for Dandruff: కేవలం రూ.10 ఖర్చుతో ఇలా 4 రోజులు చేస్తే చాలు.. చుండ్రు సమస్య ఫసక్..
Curd For Hair
Follow us on

తలలో చుండ్రు అనేది సాధారణమైన జుట్టు సమస్య. అజాగ్రత్తలు, వాతావరణ కాలుష్యం కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యల వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే చుండ్రు కారణంగా తలలో దురద, మంట వంటి పలు సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కొందరిలో జుట్టు బలహీనంగా కూడా మారుతుంది. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలు క్రమక్రమంగా పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చుండ్రును వదిలించుకోవడానికి పెరుగును జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. పెరుగులో జుట్టు కావాల్సిన క్యాల్షియం, జింక్ వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి చుండ్రును తగ్గించి అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే జుట్టు దృఢత్వం కోసం చుండ్రును నియంత్రించుకోవడానికి పెరుగును ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగును జుట్టుకు ఇలా అప్లై చేయాలంటే.. 

పుల్లటి పెరుగు: మీరు చుండ్రు సమస్యలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా జుట్టుకు పెరుగును వినియోగించాల్సి ఉంటుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది వెంట్రుకల రూట్స్‌ నుంచి చుండ్రును తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ జుట్టుకు పెరుగును అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో కేవలం పుల్లని పెరుగును మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల పాటు జుట్టుకు ఉంచి శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

పెరుగు, నిమ్మరసం: జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఇంకా చుండ్రు సమస్య నుంచి సులభంగా బయటపడటానికి పెరుగుతో పాటు నిమ్మకాయ రసాన్ని కలిపి జుట్టుకు వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌లను తొలగించడానికి సహాయపడతాయి. అయితే నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల అనేక రకాల జుట్టు సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టును రూట్ నుంచి బలంగా చేస్తుంది.

ఇవి కూడా చదవండి