Pearl Millets for Health: సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. తెలిస్తే ఈ రోజే ఫుడ్ మెనూలో చేర్చుకుంటారు..
ముఖ్యంగా మారిన ఈ ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సమస్యలు ఎక్కువైపోయాయి. గుండెకు ఆక్సిజన్ అందక కార్డియాక్ అరెస్టులు, గుండెపోటుతో మరణించే..
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో బియ్యం ప్రధాన ఆహారంగా మారిపోయింది. కానీ ఒకప్పటి మన పూర్వీకులు చిరుధాన్యాలనే ఆహారంగా తినేవారు. అందులో ముఖ్యంగా జొన్నలు, సజ్జలు, రాగులను అధికంగా తినేవాళ్లు. ఎప్పుడైతే బియ్యం పంట ఎక్కువైందో ఆ రుచికి అలవాటు పడి, చిరుధాన్యాలను పక్కన పెట్టారు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు పెరిగిపోయాయి. చిరుధాన్యాల వాడకం తగ్గడం, బియ్యం వాడకం పెరగడం ఒకేసారి జరిగింది. అలాగే మానవాళి ఆరోగ్య సమస్యల బారిన పడటం కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా మారిన ఈ ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సమస్యలు ఎక్కువైపోయాయి. గుండెకు ఆక్సిజన్ అందక కార్డియాక్ అరెస్టులు, గుండెపోటుతో మరణించే వారి శాతం పెరిగిపోయింది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్లే ఎక్కువగా గుండె వైఫల్యం చెందుతున్నట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే సజ్జలతో వండిన ఆహారాలు తినడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సజ్జలతో చేసిన అన్నం, రొట్టెలు, అల్పాహారాలు తినడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు బయటికి పోతుందని వారు చెబుతున్నారు.
ఇంకా సజ్జల్లో ఉండే ఫైటో కెమికల్ రక్తనాళాల్లో కొవ్వును పేరుకుపోనివ్వదు. ఒకవేళ పేరుకుపోయినా కూడా దానిని బయటికి పంపించేందుకు సహకరిస్తుంది. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సజ్జలను ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ సజ్జల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణం ఉంది. అలాగే సజ్జల్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియ సజావుగా సాగేలా చూస్తుంది. శరీరంలో ఎక్కడా కొవ్వు చేరకుండా కాపాడే గుణం సజ్జలకు ఉంది. కాబట్టి అధిక బరువు బారిన పడే అవకాశం తగ్గిపోతుంది. అధిక బరువుతో ముడిపడి ఉన్న అనారోగ్యాలు అంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం, ఊబకాయం వంటివన్నీ కూడా దూరంగా ఉంటాయి.
సజ్జలను తినడం కష్టం అనుకుంటారు చాలామంది, వీటిని రవ్వగా చేసి ఇంట్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడల్లా వాటితో సంగటి, అన్నం చేసుకొని తినవచ్చు. అలాగే పిల్లలకు అల్పాహారాలు, చిరుతిళ్లు కూడా వీటితో చేసుకోవచ్చు. సజ్జలతో చేసిన రొట్టెలు టేస్టీగా ఉంటాయి. వీటిని నాన్ వెజ్ కర్రీలతో తింటే వదలకుండా లాగించేస్తారు. ఒక నెలపాటు సజ్జలతో అన్నం వండుకుని తిని చూడండి. ఆరోగ్యంలో మార్పు మీకే కనిపిస్తుంది. చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. మధుమేహం బారిన పడిన వాళ్ళు ఆ వ్యాధి లక్షణాలు కనిపించకుండా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి సజ్జలు తినడం ఈరోజు నుంచే ప్రారంభించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..